MOSCOW, RUSSIA - JUNE 5, 2020: Medical workers in protective gear attend patients in an intensive care unit in an infectious diseases department for COVID-19 patients opened at Lopatkin Urology and Interventional Radiology Research Institute, a subsidiary of the National Medical Research Radiology Center of the Russian Healthcare Ministry. Valery Sharifulin/TASS Ðîññèÿ. Ìîñêâà. Ìåäèêè è ïàöèåíòû â îòäåëåíèè ðåàíèìàöèè äëÿ ïàöèåíòîâ ñ êîðîíàâèðóñíîé èíôåêöèåé ïðè ÍÈÈ óðîëîãèè è èíòåðâåíöèîííîé ðàäèîëîãèè èì. Í.À. Ëîïàòêèíà (ôèëèàë ÔÃÁÓ "ÍÌÈÖ ðàäèîëîãèè"). Âàëåðèé Øàðèôóëèí/ÒÀÑÑ
కరోనా లాక్ డౌన్ తో ప్రపంచమే బంధీ అయిపోయింది. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఓవైపు వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎవరి ప్రయత్నం వారు చేస్తుండగా.. మరోవైపు వైరస్ తాలూకు దుష్ప్రభావాలు రోజుకో రీతిన బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చేయగలిగిందీ, చేయాల్సిందీ వైరస్ సోకకుండా చూసుకోవదం మాత్రమే. కాబట్టి మాస్కు తప్పక ధరించండి.. భౌతిక దూరం పాటించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి.. సమాజం ఆరోగ్యంగా ఉండడానికి సహకరించండి.
Also Read: కరోనా టీకా కొందరికేనా..?
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 10 మంది కొవిడ్ వ్యాధిగ్రస్తులపై జరిపిన పరిశీలనలో నిపుణులు కొత్త విషయాన్ని గుర్తించారు. ఊపిరితిత్తులను పరీక్షించేందుకు వాడే స్కానింగ్ యంత్రాలకు కూడా దొరకని అనేక విషయాలు ఈ పరిశోధనలో బయటపడ్డాయని వైద్యులు వెల్లడించారు. తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో.. కరోనాకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగు చూసింది. కొవిడ్ బారిన పడి మూడు నెలలు గడిచిన తర్వాత కూడా.. ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం చూపుతోందని తేలింది. 19 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్కులైన 10 మంది కొవిడ్ పేషెంట్లను ఈ పరిశోధనకు ఎంచుకున్నారు. ప్రొఫెసర్ ఫెర్గస్ గ్లీసన్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన జరిపింది. ఈ పది మంది వ్యాధి గ్రస్తుల్లో.. ఎనిమిది మంది దాదాపు మూడు నెలల పాటు శ్వాస సంబంధమైన సమస్యలతోపాటు, అలసట వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు నిపుణులు గుర్తించారు.
ఈ పరిశీలన కోసం ఊపిరితిత్తులకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసే సమయంలో “జెనాన్” అనే గ్యాస్‌ను ఉపయోగించారు. ఈ స్కానింగ్ ద్వారానే కొవిడ్ పేషెంట్ల ఊపిరితిత్తులలో దీర్ఘకాలం కొనసాగడానికి అవకాశం ఉన్న సమస్యలు కనిపించాయని నిపుణులు వెల్లడించారు. కరోనా సోకడానికి ముంద వీరిలో ఎవరికీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం గానీ, వెంటిలేషన్ మీద ఉండాల్సిన పరిస్థితి గానీ రాలేదని తెలిపారు. అంతేకాదు.. వీరికి మొదట నిర్వహించిన సాధారణ స్కాన్‌లో ఏ సమస్యా లేదని తేలడం గమనార్హం. కొవిడ్ వైరస్ వెలుగు చూసి ఏడాది గడిచింది.
Also Read: హాట్ టాపిక్.. జాతీయగీతం మారబోతుందా?
కొవిడ్ కారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో మరణాలు ఎక్కువగా ఉన్నాయని, తమ పరిశోధనలో ఊపిరితిత్తుల సమస్య ఇంకా ఎక్కువ స్థాయిలో ఉందని తేలితే మాత్రం.. ఇప్పటి వరకు అనుసరిస్తున్న వైద్య విధానాల పద్ధతులను చాలా వరకు మార్చుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ గ్లీసన్ చెప్పారు. ఈ ఫలితాల కోసం తాము మరో 100 మందిపై పరిశోధనలు జరపనున్నట్టు చెప్పారు. నెలక్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టినా కేసుల సంఖ్య.. “సెకండ్ వేవ్” విజృంభణతో రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత శనివారం ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 6 లక్షల 3 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ సెకండ్ వేవ్ దెబ్బకు వణికిపోతున్నాయి. మానవాళికే సవాల్ విసురుతున్న ఈ వైరస్ నివారణకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ సంగతి అటుంచితే.. అసలు ఇప్పటి వరకు వ్యాధి తీవ్రత ఎంత? ఎవరి మీద ఎలా పనిచేస్తుంది? ఎంతకాలం ప్రభావం చూపుతుంది? అనే విషయం కూడా అంతు చిక్కలేదు. వ్యాధి గ్రస్తుల రక్తంలో ఆక్సిజన్ సరైన పరిమాణంలో కలవడం లేదని గుర్తించారు. అంతే కాకుండా.. ఈ మూడు నెలల్లో కొన్నాళ్లు శ్వాస సంబంధమైన సమస్యను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా.. కొవిడ్ పేషెంట్లలో ఊపిరితిత్తులు ఎంతవరకు చెడిపోతాయి అనే విషయం తెలుసుకోవడమే తమ లక్ష్యమని, ప్రొఫెసర్ గ్లీసమ్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Another new complication with the corona
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com