Homeజాతీయ వార్తలుCovid: కోవిడ్ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఐదుగురు మృతి

Covid: కోవిడ్ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఐదుగురు మృతి

Covid: కోవిడ్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. రెండు సంవత్సరాల పాటు యావత్ ప్రపంచాన్ని వినిపించిన ఈ మాయదారి వైరస్ మరో వేరియంట్ రూపంలో పొంచి ఉంది. ఇప్పటికే దీని బారిన పడి భారతదేశంలో ఐదుగురు చనిపోయారు. అసలే శీతాకాలం.. వైరస్ వ్యాప్తి చెందిందుకు అనువైన కాలం కావడంతో శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సంకేతాలు పంపిస్తున్నారు.. 2020లో వెలుగుచూసిన కోవిడ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రపంచానికి చుక్కలు చూపించింది. మొదటి వేరియంట్ కంటే రెండవ వేరియంట్ లో అధికంగా మరణాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ప్రభుత్వం వ్యాక్సిన్ రూపొందించి దేశం మొత్తం ఉచితంగా పంపిణీ చేసింది.. అయితే కోవిడ్ కి గురైన వారిలో ఇప్పటికీ చాలామంది అస్వస్థతతో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది గుండెపోట్లకు గురయ్యారు. అందులో కొంతమంది కన్నుమూశారు కూడా.

జేఎన్.1 వేరియంట్

ప్రస్తుతం మన దేశంలో వెలుగు చూస్తున్న కోవిడ్ వేరియంట్ కు జేఎన్.1 నామకరణం చేశారు. కేరళ రాష్ట్రంలో ఈ వేరియంట్ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల 8న కేరళ రాష్ట్రంలో 79 ఏళ్ల వృద్ధురాలిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. దీనికి తోడు ఆదివారం దేశంలో 260 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ఆక్టివ్ కేసుల సంఖ్య 1828 కి పెరిగింది. ఇక ఒక్కరోజులో కేరళ రాష్ట్రంలో నాలుగు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి చొప్పున అయిదు మరణాలు సంభవించాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. శీతకాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని.. దీనిని అధిగమించేందుకు ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలు పట్లు చేసుకోవాలని సూచించింది.

కోవిడ్ కొత్త వీరియంట్ వెలుగుచూసిన నేపథ్యంలో ఇన్ ప్లుయంజా మాదిరి అస్వస్థత, తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులున్న కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సరిపడా ఆర్టీపిసిఆర్ పరీక్షల కిట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఆర్ టి పి సి ఆర్, జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు పంపాలని కేంద్రం ఆదేశించింది. ఇక పొరుగు రాష్ట్రమైన కేరళలో కేసులు పెరగడం పట్ల కర్ణాటక రాష్ట్రం అప్రమత్తమైంది. 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అత్యవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది.. కేరళ రాష్ట్రం తో సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటకలోని కొడగు, దక్షిణ కన్నడ, చామరాజ నగర్ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు జారీ చేసింది.. ఇక ఈ కొత్త వేరియంట్ పై కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వేరియంట్ ప్రమాదకారి అని చెప్పలేమని, గతంలోనే భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన 15 మందిలో ఇది బయటపడిందని ప్రకటించింది. నాలుగు మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని వివరించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular