Anil Ravipudi: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్- వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఎఫ్3. తమన్న, మెహ్రిన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. సునీల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఇవాళ అనిల్ రావిపుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. ఈ సినిమా విశేషాలతో పాటు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం.
దర్శకుడిగా తనకు ఇది ఆరో పుట్టినరోజని అన్నారు అనిల్, ఎఫ్3 సెట్స్‌లోనే తన పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయని అన్నారు. ఈ సినిమా విడుదలపై స్పందించిన ఆయన.. నా దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికే విడుదలయ్యాయి. ఎఫ్3 కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. కానీ మిస్ అయ్యింది.. కానీ సోలోగా ఎంట్రీ ఇస్తాం అని న్వువతూ అన్నారు. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 85 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని అన్నారు.
కాగా, చిన్నపిల్లలతో ఇంట్లో అనుభవించే ఎలిమెంట్స్ అన్నీ ఎఫ్3లో ఉంటాయని అన్నారు అనిల్. థియేటర్లలో ఈ సినిమా చూసినప్పుడు అరే.. మా ఇంట్లో కూడా ఇదే ప్లాబ్లమ్స్ కదా అనుకుంటారని అన్నారు. ఇక ఎఫ్2 తన బయోపిక్ అని.. ఇంకా చెప్పాలంటే మొగాళ్లందరి బయోపిక్ అని అన్నారు. మరోవైపు, ఈ సినిమాలో హీరోలుగా నటించిన వరుణ్, వెంకీల మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడిందని అన్నారు. ఈ సినిమాలో దాదాపు 35 మంది ప్రధాన పాత్రలో నటిస్తున్నారని అన్నారు. కాగా, ఇటీవల వెంకీ ఎఫ్3 ఫస్ట్ఆఫ్ చూసి.. సినిమాలో నేనొక్కడినే బాగా చేశాననుకున్నా.. అందరూ ఇరగ్గొట్టేశారు అన్నారని తెలిపారు. అనిల్.