Sankranthiki Vasthunam : ప్రస్తుతం సీనియర్ హీరోల మార్కెట్ రోజు రోజుకి పెరుగుతుపోతుంది. చిరంజీవి లాంటి స్టార్ హీరో భారీ సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో బాలయ్య బాబు వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు సైతం వాళ్ళ మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు…
కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ‘అనిల్ రావిపూడి'(Anil Ravipudi)… ఆయన 8 సినిమాలను చేస్తే 8 సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఇక వెంకటేష్ లాంటి నటుడు సైతం చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం అనేది అతని అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన వెంకటేష్ ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా వరుస సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతో ఆచితూచి మరి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన 25 స్టోరీలను రిజెక్ట్ చేశారట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పటినుంచి తన కెరియర్ లో ఒకటి కూడా ఫ్లాప్ సినిమా ఉండొద్దనే ఉద్దేశ్యం తో వెంకటేష్ మంచి సబ్జెక్ట్ ని ఎంచుకోవాలని చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా ఏ జానర్ లో ఉండబోతుంది.
Also Read : వెంకటేష్ అరుదైన ఫీట్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ 50 డేస్ ఎన్ని సెంటర్స్ లో ఆడిందో తెలుసా?
ఏ దర్శకుడుతో ఆయన సినిమా చేయబోతున్నాడనే విషయాల మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది… ఇక సీనియర్ హీరోలు అందరిలో వెంకటేష్ కొంత వరకు ముందు వరుసలో ఉన్నాడు. 300 కోట్ల మార్కెట్ ను కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇంతకు ముందు వరకు వెంకటేష్ కి 50 కోట్ల మార్కెట్ కూడా సరిగ్గా లేదు.
అలాంటిది ఒక్కసారిగా 300 కోట్ల మార్కెట్లోకి వెళ్లిపోయాడు అంటే వెంకటేష్ ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకున్నాడో మనకు అర్థమైపోతుంది…మరి అలాంటి వెంకటేష్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఒకరకంగా వెంకటేష్ రొటీన్ రొట్ట సినిమాలను కాకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దామనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఆయన 25 స్క్రిప్ట్ రిజెక్ట్ చేశారట… చూడాలి మరి ఇక మీదట ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి. తద్వారా ఆ సినిమాలు భారీ వసూళ్లను రాబడతాయా లేదా అనేది…