Balayya Babu and Venkatesh : నందమూరి నటసింహంగా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న బాలయ్య బాబు (Balayya Babu) ప్రస్తుతం ‘అఖండ 2’ (Akhanda 2) సినిమా చేస్తున్నాడు. ఇక సీనియర్ హీరోలందరిలో బాలయ్య బాబు చాలా వరకు ముందు వరుసలో ఉన్నాడు. వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ఆయన చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ఇప్పటివరకు వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న బాలయ్య బాబు తన తదుపరి సినిమాతో కూడా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో 300 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు. ఇక బాలయ్య బాబు 200 కోట్ల మార్కెట్ దగ్గరే ఉన్నాడు. కాబట్టి అఖండ 2 సినిమాతో దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడతానని బాలయ్య బాబు భారీ కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సీనియర్ హీరోలందరి కంటే కూడా బాలయ్య బాబు మంచి రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమా మీద బోయపాటి సైతం తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడట.
Also Read : బాలయ్య బాబు వరుసగా నాల్గోవ సక్సెస్ కొట్టడం వెనక అసలు కారణం ఇదేనా..?
ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని భారీ సెట్ల ను సైతం వేయించినట్టుగా తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు ఈ షూటింగ్ లో పాల్గొని సినిమా షూట్ ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట… మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండటం వల్ల ఆయనకు వరుస సక్సెసులైతే దక్కుతున్నాయి.
మరి ఈ సినిమా తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని (Gopi Chand Malineni) దర్శకత్వంలో బాలయ్య బాబు ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక అతనితోపాటు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.
ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ముగిసిన వెంటనే బాలయ్య బాబుతో మరొకసారి బారీ గుర్తింపును సంపాదించుకోబోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మంచి గుర్తింపైతే లభించింది…
Also Read : చిక్కుల్లో పడ్డ విక్టరీ వెంకటేష్..’సంక్రాంతికి వస్తున్నాం’ ఎఫెక్ట్..ఎటూ తేల్చుకోలేకపోతున్నాడుగా!