Chiranjeevi and Anil Ravipudi : ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ హీరోలందరూ తమ వయస్సు కి తగ్గట్టుగా సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ సూపర్ హిట్స్ ని అందుకుంటూ కుర్ర హీరోలతో సమానమైన వసూళ్లను రాబడుతున్నారు. కానీ ఒక్క మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాత్రమే ఇప్పటికీ యంగ్ రోల్స్ చేస్తూ సహజత్వానికి బాగా దూరమైపోయాడు అనే ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. ఆయన వయస్సు ఇప్పుడు దాదాపుగా 70 ఏళ్ళు. ఇప్పటికీ ఆయన హీరోయిన్ తో డ్యూయెట్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నాడు. ఇది చూసే ప్రేక్షకులకే కాదు, అభిమానులకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కి వరుసగా వంద కోట్ల సినిమాలు చాలానే వచ్చాయి. ఆ రేంజ్ ఏంటో నేటి తరం ఆడియన్స్ కి తెలిసింది. కానీ చిరంజీవి ఒక మహానటుడు. ఆయన పాత సినిమాలు చూస్తే మెగాస్టార్ ఎలాంటి నటుడు అనేది తెలుస్తుంది.
Also Read : కేవలం 4 నెలల్లోనే చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం..? మెగా ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్!
అలాంటి మెగాస్టార్ నటన ఈమధ్య చాలా ఆర్టిఫీషియల్ అయిపోయింది. కారణం ఆయన వయస్సుకి తగ్గ పాత్రలు చేయకపోవడమే. అందుకే డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) మనమంతా చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వింటేజ్ మెగాస్టార్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఆయన వయస్సుకి తగ్గ పాత్రని డిజైన్ చేసాడట. ఈ చిత్రం లో హీరోయిన్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, ఒకవేళ హీరోయిన్ ఉన్నప్పటికీ ఆమెతో కలిసి రొమాంటిక్ సాంగ్స్ లో నటించడం వంటివి ఉండవని తెలుస్తుంది. కేవలం చిరంజీవి వయస్సుకి తగ్గ పెద్ద మనిషి తరహా పాత్రను డిజైన్ చేశాడని, ఆయన మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు,మాస్, యాక్షన్ కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి స్క్రిప్ట్ ని డెవలప్మెంట్ చేస్తున్నాడని టాక్. ఈ ఉగాది పర్విదినాన్ని పురస్కాటించుకొని, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర'(Vishwambhara Movie) చిత్రం చేస్తున్నాడు. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న గ్రాఫిక్స్ ఆధారిత సినిమా ఇది. గత ఏడాది ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై దారుణమైన ట్రోల్స్ ని ఎదురుకుంది. భారీ బడ్జెట్ సినిమా అన్నారు, మరి ఇదేంటి అమీర్ పేట్ గ్రాఫిక్స్ ఉన్నాయి అంటూ అభిమానులు సైతం పెదవి విరిచారు. టీజర్ లో గ్రాఫిక్స్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని చూసిన మూవీ టీం, ఇప్పుడు గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేసి, మళ్ళీ రీ వర్క్ చేయిస్తున్నారు. మే నెలలో విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఈ ఏడాది చివరికు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, కన్నడ టాప్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి కథ ఆ టైమ్ పీరియడ్ లో రానుందా..?