Chiranjeevi and Anil Ravipudi : ఈ ఏడాదితో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి 70 ఏళ్ళు పూర్తి అవుతాయి. ఈ వయస్సు లో కూడా ఆయన కుర్ర స్టార్ హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. అంతే కాదు వాళ్ళతో సమానంగా ఆయన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా కొడుతున్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చి 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి, మెగాస్టార్ ని ఎందుకు నెంబర్ 1 హీరో అని పిలుస్తారో నేటి తరం ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసింది. అయితే ఆయన గత చిత్రం ‘భోళా శంకర్’ కమర్షియల్ గా ఎలాంటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి కథ ఆ టైమ్ పీరియడ్ లో రానుందా..?
ఈ సినిమాతో చిరంజీవి కి రీమేక్ సినిమాలను ఇప్పటి ఆడియన్స్ ఆదరించరు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆయన తన తదుపరి చిత్రాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ లో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఒక సాంగ్ షూటింగ్ ని కూడా పూర్తి చేసారు. ఆగస్టు 22 న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని జూన్ నెలలో మొదలు పెట్టి, అక్టోబర్ లో పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నాడట డైరెక్టర్. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నాడు అన్నమాట.
మెగాస్టార్ లాంటి స్టార్ తో ఇంత వేగంగా సినిమా తీయడం అనేది కేవలం అనిల్ రావిపూడి కి మాత్రమే సాధ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి లోని పూర్తి కామెడీ టైమింగ్ ని మరోసారి బయటకు తీసి, అభిమానులకు పొట్ట చెక్కలు అయ్యే పాయింట్ తో స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా స్క్రిప్టింగ్ స్టేజి లోనే ఉందట. ఉగాదికి పూజ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు ఆయన శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘దసరా’ తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తో ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమాకి షిఫ్ట్ కాబోతున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతగా నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) వ్యవహరించడం కొసమెరుపు. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ని మళ్ళీ వాడుతున్నారా..?