Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం లో ప్రతీ ఒక్కరిని ప్రోత్సహిస్తూ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ కి కూడా కేవలం తన కుటుంబ సభ్యుడు అనే ఫామ్ లో లేకపోయినా అవకాశం ఇచ్చాడు. అలా ఆయన తీసిన ‘భోళా శంకర్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇలా తన సొంత కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం వల్ల చిరంజీవి(Megastar Chiranjeevi) కి కొన్ని సార్లు భారీ నష్టాలే ఎదురు అయ్యాయి. అలా ఆయనకు కూతురు సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) వల్ల కూడా తీవ్రమైన నష్టాలు ఎదురయ్యాయి. కారణం ఆమె చిరంజీవి ప్రతీ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేయడం వల్లే. ఈమె చిరంజీవి లుక్స్ దగ్గర నుండి, కాస్ట్యూమ్ డిజైనింగ్ వరకు అన్ని సుస్మిత నే దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె పనితనం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.
బయట చూసేందుకు అదిరిపోయే లుక్స్ లో కనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, సినిమాల్లో ఎందుకు అలాంటి లుక్స్ లో కనిపిస్తున్నాడు అంటూ అభిమానులు సైతం అనేకసార్లు తమ నిరసన వ్యక్తం చేసారు. అందుకు కారణం సుస్మిత కొణిదెల పనితనమే అని అంటున్నారు అభిమానులు. రంగురంగుల చొక్కాలు, చిరంజీవి కి ఈ వయస్సులో ఏ మాత్రం సూట్ అవ్వని కాస్ట్యూమ్స్ వంటివి చూసే ఆడియన్స్ కి చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకే ఆమెని తన తదుపరి చిత్రానికి పక్కకి నెట్టేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. SLV సినిమాస్ తో పాటు, సుస్మిత కొణిదెల కూడా ఈ చిత్ర నిర్మాణం లో భాగం పంచుకుంటుంది. అయితే ఆమె ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా మాత్రం పని చేయడం లేదట. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తాను మొదటి నుండి మైంటైన్ చేస్తూ వస్తున్న టీం ఈ సినిమాకి పని చేస్తారని టాక్.
అనిల్ రావిపూడి తన సినిమాల్లో హీరో ని చాలా అందంగా చూపిస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లో వెంకటేష్ ని ఎంత అందంగా చూపించాడా మన అందరికీ తెలిసిందే. అదే విధంగా భగవంత్ కేసరి చిత్రం లో కూడా బాలయ్య ని స్క్రీన్ మీద బాగా చూపించాడు. మెగాస్టార్ ని కూడా అలాగే చూపించబోతున్నట్టు టాక్. ఈ సినిమాలో చిరంజీవి క్యారక్టర్ ‘గ్యాంగ్ లీడర్’ తరహా లో ఉంటుందని, ఆయన స్లాంగ్ కూడా చాలా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఇక ఈ సినిమా హీరోయిన్ గా చేయబోతున్నది ఎవరు, విలన్ గా చేయబోతున్నది ఎవరు అనే వాటిపై ప్రస్తుతానికి సస్పెన్స్. ఇంకా ఈ చిత్రం స్క్రిప్ట్ డెవలప్మెంట్ దశలోనే ఉంది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి కథ ఆ టైమ్ పీరియడ్ లో రానుందా..?