Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam : విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చి దశాబ్దాలు అవుతుంది. సోలోగా యాభై కోట్లు కూడా కష్టమే అనుకుంటున్న తరుణంలో ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్,కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం అద్భుత విజయం సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదలైంది. వెంకటేష్ కి జంటగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. కామెడీ వర్క్ అవుట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి ఈ సినిమా చూశారు.
వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచింది. కాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఏకంగా 92 సెంటర్స్ లో సంక్రాంతికి వస్తున్నాం యాభై రోజులు ఆడింది. ఒకప్పటి ట్రెండ్ ని వెంకటేష్ గుర్తు చేశాడు. మారిన సమీకరణాల రీత్యా ఎంత పెద్ద హిట్ మూవీ అయినప్పటికీ మూడు నాలుగు వారాలు ఆడటమే ఎక్కువ. ఓపెనింగ్ వీక్ లోనే బిజినెస్ మొత్తం జరిగేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గతంలో మాదిరి 100 డేస్ 100 సెంటర్స్ అనే పరిస్థితి ఇప్పుడు లేదు.
దీన్ని బ్రేక్ చేస్తూ వెంకటేష్ మూవీ దాదాపు వంద సెంటర్స్ లో యాభై రోజులు ఆడి, సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. గతంలో వసూళ్లతో పాటు ఒక సినిమా ఎన్ని రోజులు ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది విజయానికి ప్రామాణికంగా ఉండేది. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బుల్లితెర మీద కూడా ప్రసారం చేశారు. జీ5లో స్ట్రీమ్ అవుతున్న సంక్రాంతికి వస్తున్నాం అక్కడ కూడా విశేష ఆదరణ దక్కించుకుంటుంది.
ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీ కథ విషయానికి వస్తే… డీసీపీ వైడీ రాజు(వెంకటేష్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. పోలీస్ వ్యవస్థలో ఉన్న చెడును భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. రాజును భాగ్యం(ఐశ్యర్య రాజేష్) మొదటి చూపులోనే ప్రేమిస్తుంది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటుంది. ఇల్లరికం ఉంటూ పల్లెటూళ్ళో భార్య, పిల్లలతో బ్రతుకుతున్న రాజు వద్దకు మాజీ ప్రేయసి మీనాక్షి(మీనాక్షి చౌదరి) వస్తుంది. ఆమె రాకతో సమీకరణాలు మారిపోతాయి. అసలు మీనాక్షి ఎందుకు వచ్చింది? భాగ్యం-మీనాక్షి మధ్య రేగిన చిచ్చు ఎలా చల్లారింది? మీనాక్షి అనుకున్నది జరిగిందా? అనేది మిగతా కథ..
Also Read : ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూసిన ఆడియన్స్ కి షాక్, కారణం ఇదే! డైరెక్టర్ ఇలా చేశాడేంటి?
#SankranthikiVasthunam 50 days in 92 Centers #Venkatesh #anilravipudi pic.twitter.com/fVjCtpf3LP
— TeluguBoxOffice (@TeluguBoxOffie) March 4, 2025
Web Title: Sankranthiki vasthunam venkatesh movie 50 days performance
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com