Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Political Situation: వైసిపి నిరూపించుకోవాల్సిందే!

YSRCP Political Situation: వైసిపి నిరూపించుకోవాల్సిందే!

YSRCP Political Situation: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పూర్తిగా నైరాస్యంలో పడిపోయింది. 2014లో ఓడిపోయింది కానీ గౌరవప్రదమైన సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. ఈసారి మాత్రం దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పార్టీలో పూర్తిగా నిస్తేజం అలుముకుంది. కొన్ని వర్గాలు అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకం అయిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే ఉన్న ఏకైక అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం అన్నది లేకుండా చూడాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం సైతం తాము వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించమని.. పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉంది.

* వైసిపి హయాంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 2021 లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. అప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తరువాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అందుకే టిడిపి అధినేత చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించారు. అప్పట్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన సంయుక్తంగా 20 శాతానికి పైగా గెలుచుకున్నాయి. 80 శాతం వరకు వైసిపి పంచాయితీలను కైవసం చేసుకుంది. 100కు పైగా మున్సిపాలిటీలతోపాటు 12 కార్పొరేషన్లకు సంబంధించి కూడా వైసిపి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే అప్పట్లో వైసిపి దూకుడుగా వ్యవహరించడమే కాదు.. అధికార జులుం ప్రదర్శించిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ 20 శాతానికి పైగా ప్రతిపక్షం గెలుచుకుంటే టర్నింగ్ పాయింట్ అయినట్టే.

* ఎన్నికలకు సిద్ధం..
కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రస్తుతం జరుగుతోంది. వెనువెంటనే సామాజిక పింఛన్లు తో పాటు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రకటనలు రానున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశం. అప్పట్లో వైసీపీ వ్యవహరించినట్టుగా తమ ప్రభుత్వం వ్యవహరించదని చంద్రబాబు చెబుతున్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో కూటమి ఏకపక్షంగా గెలుచుకుంటే వైసీపీకి ఇబ్బందికరమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 శాతానికి పైగా స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటే ఆ పార్టీకి ప్లస్ పాయింట్. కానీ వైసిపి ఆ పని చేయగలదా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇప్పటికీ ఆ మూడు పార్టీల మధ్య బంధం గట్టిగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్న కసి కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper