Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Two Capitals: మూడు కాదు రెండు రాజధానులు.. వైయస్సార్ కాంగ్రెస్ కొత్త స్టాండ్

YSR Congress Two Capitals: మూడు కాదు రెండు రాజధానులు.. వైయస్సార్ కాంగ్రెస్ కొత్త స్టాండ్

YSR Congress Two Capitals: వైఎస్ఆర్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. మూడు రాజధానుల విషయంలో ఆ పార్టీకి ప్రజల తిరస్కారం ఎదురైంది. అయినా సరే ఆ పార్టీ ఎందుకో అమరావతి విషయంలో ఇంకా దాగుడుమూతలు ఆడుతూనే ఉంది. మొన్ననే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అమరావతి ఏకైక రాజధాని అని మార్పు చేస్తూ తీర్మానం చేసి పంపించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అమరావతి విషయంలో తమ […]

YSR Congress Two Capitals: వైఎస్ఆర్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. మూడు రాజధానుల విషయంలో ఆ పార్టీకి ప్రజల తిరస్కారం ఎదురైంది. అయినా సరే ఆ పార్టీ ఎందుకో అమరావతి విషయంలో ఇంకా దాగుడుమూతలు ఆడుతూనే ఉంది. మొన్ననే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అమరావతి ఏకైక రాజధాని అని మార్పు చేస్తూ తీర్మానం చేసి పంపించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అమరావతి విషయంలో తమ స్టాండ్ చెప్పాల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే ఇప్పుడు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాత్రం రాజధానులను మార్చే శక్తి ప్రజలకు ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. దేశంలో చాలా రాష్ట్రాలకు రెండో రాజధానులు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో అమరావతి ఏకైక రాజధానికి తాము వ్యతిరేకం అని సంకేతాలు పంపిస్తున్నారు. అలాగని బాహటంగా చెప్పడం లేదు.

* ప్రజలు తిరస్కరించినా..
మూడు రాజధానులు( three capitals ) అనే పాలసీని తీసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ గట్టిగానే దెబ్బతింది. పోనీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ స్టాండ్ మారలేదు. కానీ దానిని నేరుగా చెప్పడం లేదు ఆ పార్టీ. మూడు రాజధానుల అంశం ఫెయిల్ కావడంతో.. సహజంగానే మౌనంగా ఉండాలి. కానీ అమరావతిపై ఇంకా ఆ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. ఈ పరిస్థితిని గ్రహించిన చంద్రబాబు సర్కార్ అమరావతికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత లేదు. కానీ ఏపీకి మాత్రం ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర క్యాబినెట్లో చర్చించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనుంది.

* రాజధాని మార్పు ఉండాలంటున్న ధర్మాన..
ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి( AP special assembly session) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరు అయింది. అమరావతికి తాము అనుకూలమని చెప్పలేదు. వ్యతిరేకమని చెప్పలేదు. సానుకూలం అని సంకేతాలు పంపిస్తున్నారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు లాంటి వారు మాట్లాడుతున్నారు. సరికొత్త లాజిక్ తో ధర్మాన ప్రసాదరావు ముందుకు వచ్చారు. రాజధాని ఒకే చోట ఉండాలని చెప్పడం సరికాదు అని వ్యాఖ్యానించారు. ప్రజల నిర్ణయంతో రాజధాని మార్చే హక్కు ఉండాలని అంటున్నారు. ఆనాడు ఉమ్మడి మద్రాస్ నుంచి ఈనాటి అమరావతి వరకు రాజధాని మారలేదా అనే ప్రశ్న ఆయన నోటి నుంచి వచ్చింది. రాజ్యాంగం పేరుతో అభివృద్ధి అంతా అవకాశాలు అంత ఒకే చోట బంధించడం సరికాదని ధర్మాన వ్యాఖ్యానించారు. తద్వారా అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper