spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌.షర్మిల.. తొలి స్పందన వైరల్‌!

YS Sharmila: కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌.షర్మిల.. తొలి స్పందన వైరల్‌!

YS Sharmila: తెలంగాణలో వైఎస్‌.షర్మిల రెండేళ్ల క్రితం స్థాపించిన వైఎస్సార్‌టీపీని గురువారం కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీని విలీనం చేయడంతోపాటు షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని చెప్పారు.

గర్వంగా ఉందని..
కాంగ్రెస్‌తో చేరినందుకు తనక ఎంతో గర్వంగా ఉందని షర్మిల తెలిపారు. బుధవారం నుంచి వైఎస్సార్‌ టీపీ కాంగ్రెస్‌లో భాగమే అని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్‌ అడుగు జాడల్లో నడుస్తానన్నారు. దివంగత నేత వైఎస్సార్‌ కల రాహుల్‌ప్రధాని కావడమే అని దాని కోసం తాను కూడా కష్టపడతానని తెలిపారు. దేశంలో సెక్యూలర్‌ పార్టీ అధికారంలో లేనందునే మణిపూర్‌లో అల్లర్లు జపరిగాయని తెలిపారు.

అండమాన్‌లో అయినా పనిచేస్తా..
తను ఇక కాంగ్రెస్‌ కార్యకర్తనని, అధిష్టానం ఏ పని చేయమంటే అది చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అయినా.. అండమాన్‌లో అయినా పని చేయడానికి సిద్దమని షర్మిల ప్రకటించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని మరోమారు వెల్లడించారు.

కండువా కప్పుకోని అనిల్‌..
అంతకుముందు షర్మిల తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ సందర్భంగా అనిల్‌ కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని అనుకున్నారు. కానీ అనిల్‌ పార్టీ కవండు కప్పుకోకపోవడం గమనార్హం. షర్మిల పార్టీలో చేరిన తర్వాత అనిల్‌తో కలిసి సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. సోనియాను కలిశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper