Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other Reality Show: ' మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ...

Mad For Each Other Reality Show: ‘ మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘..’స్టార్ మా’ లో సరికొత్త రియాలిటీ షో..’బిగ్ బాస్’ ని మించిన కాన్సెప్ట్!

Mad For Each Other Reality Show: బాలీవుడ్ లో ‘బిగ్ బాస్’ లాంటి రియాలిటీ షోస్, అంతకు మించిన కాన్సెప్ట్ తో వచ్చే రియాలిటీ షోస్ చాలానే ఉన్నాయి. మనకు కేవలం ‘బిగ్ బాస్’ మాత్రమే తెలుసు. అయితే త్వరలోనే స్టార్ మా ఛానల్ లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే బిగ్గెస్ట్ రియాలిటీ షో టెలికాస్ట్ కానుంది. ఈ షో కాస్త ‘బిగ్ బాస్’ ఫార్మటు తరహాలోనే ఉంటుంది. కానీ పూర్తిగా అదే ఫార్మటు లో ఉండదు. పెళ్లి చేసుకున్న జంటలు, అదే విధంగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న జంటలు, మొత్తం మీద పాదు జంటలు ఈ షోలో పాల్గొనబోతున్నారు. షో కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఒక భారీ విల్లా ఉంటుంది. ఆ విల్లా లోకి ఈ పది మంది జంటలను పంపిస్తారు. వాళ్ళ మధ్య అనేక రకమైన టాస్కులను నిర్వహిస్తారు.

ఆ టాస్కులు జంటల మధ్య ఎంత ప్రేమ ఉంది అని తెలిపేలా ఉంటుంది. ఈ క్రమం లో జంటల మధ్య పెద్ద గొడవలు కూడా జరగొచ్చు. టాస్కుల్లో ఓడిపోయిన జంటలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు, గెలిచిన జంటలు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఈ డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు లోపల ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది జనాల ఓటింగ్ ద్వారా నిర్ణయించరు, సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ మరియు ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు నిర్ణయిస్తారు. అలా ప్రతీ వారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది. మొత్తం మీద 70 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానుంది. కేవలం వీకెండ్స్ లోనే జడ్జీలు వస్తారు. ఒక జడ్జి గా సీనియర్ హీరోయిన్ రాధ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మిగిలిన జడ్జీలు ఎవరు అనేది చూడాలి. అదే విధంగా షోకి హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించబోతుంది.

ఇక ఈ షోలో పాల్గొనబోయే పది జంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వాసంతి కృష్ణన్ – పవన్ కళ్యాణ్ , అంజలి – పవన్, హరిత – హరీష్(మాస్క్ మ్యాన్), సోనియా సింగ్ – సిద్దు, ప్రియాంక జైన్ – శివ్, శుభశ్రీ(బిగ్ బాస్ 7 కంటెస్టెంట్) -అజయ్, నూకరాజు – ఏంజెల్ ఏషియా, నటరాజ్ మాస్టర్ – నీతూ, మహేష్ బాబు – సాండ్రా, నాని – పింకీ. ఈ పది జంటలు ఆదివారం రోజున (రెండు రోజుల క్రితం) విల్లా లోకి అడుగుపెట్టారట. షూటింగ్ కూడా రెండు రోజులకు సంబంధించి అయిపోయింది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ‘BB జోడి 2’ టెలికాస్ట్ అవుతుంది. ఈ షో పూర్తి అవ్వగానే, ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. ఉన్న సమాచారం ప్రకారం మార్చి 14 నుండి ఈ షో టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular