spot_img
Homeఆంధ్రప్రదేశ్‌BJP: బిజెపి కోసం త్యాగం చేసేదెవరు?

BJP: బిజెపి కోసం త్యాగం చేసేదెవరు?

BJP: బిజెపి మరో అసెంబ్లీ స్థానాన్ని కోరుతుందా? 11వ సీటును ఆశిస్తోందా? అయితే అది టిడిపి స్థానమా? లేకుంటే జనసేనదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలతో పాటు పది అసెంబ్లీ సీట్లు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ,17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.అయితే తొలుత జనసేనకు 24 అసెంబ్లీ,మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు.కానీ బిజెపి కోసం పవన్ మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని వదులుకున్నారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మూడు స్థానాల్లో బిజెపి అభ్యర్థులను ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ఇది చాలదన్నట్టు మరో అసెంబ్లీ సీటు బిజెపికి రానుందని పురందేశ్వరి ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.

ఇప్పటికే బీజేపీకి ఇచ్చిన 10 సీట్లలోనూ రాజకీయ రచ్చ సాగుతోంది. బిజెపికి సీటు ఇచ్చిన ప్రతి చోట టిడిపి శ్రేణులు రగిలిపోతున్నాయి. మరికొన్నిచోట్ల జనసేన సైతం వీధిన పడుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పురందేశ్వరి ప్రకటన అగ్నికి ఆజ్యం పోస్తోంది.జనసేన పాలకొండ,అవనిగడ్డ, విశాఖ సౌత్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. తెలుగుదేశం సైతం భీమిలి, చీపురుపల్లితో పాటు మరో ఐదు స్థానాలను అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో బీజేపీ 11వ స్థానం విషయంలో ఎవరు త్యాగం చేయాల్సి ఉంటుందో తెలియాల్సి ఉంది.

బిజెపిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహం వంటి వారికి సీట్లు లేకుండా పోయాయి. కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూల నేతలకే టికెట్లు దక్కాయి. దీంతో అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. అటు హై కమాండ్ సైతం రాష్ట్ర నాయకత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ తరుణంలోనే పురందేశ్వరి ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోము వీర్రాజుకు సీటు సర్దుబాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం రాజమండ్రి అర్బన్ కానీ, రూరల్ నియోజకవర్గం కానీ అడుగుతున్నారు. కానీ అక్కడ టిడిపికి బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రకటించాల్సిన 8 స్థానాల్లో బిజెపికి ఒక సీటు వదులుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper