Harish Madhur: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థానాలు విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలు దక్కించుకొని జాతీయస్థాయిలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దించుతోంది. పొత్తులో భాగంగా టిడిపికి 17 స్థానాలు దక్కగా.. 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాల్లో ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీష్ మాధుర్ అనే యువకుడిని చంద్రబాబు ప్రకటించారు. ఈయన అత్యంత పిన్నవస్కుడిగా నమోదయ్యారు. కేవలం ఈయనకు 33 సంవత్సరాలు ఉండడం గమనార్హం. అయితే ఈయన ఎవరో కాదు.. లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థానాలు విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలు దక్కించుకొని జాతీయస్థాయిలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దించుతోంది. పొత్తులో భాగంగా టిడిపికి 17 స్థానాలు దక్కగా.. 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాల్లో ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీష్ మాధుర్ అనే యువకుడిని చంద్రబాబు ప్రకటించారు. ఈయన అత్యంత పిన్నవస్కుడిగా నమోదయ్యారు. కేవలం ఈయనకు 33 సంవత్సరాలు ఉండడం గమనార్హం. అయితే ఈయన ఎవరో కాదు… లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు.
గంటి మోహనచంద్ర బాలయోగి.. అలియాస్ జిఎంసి బాలయోగి. తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు ఇది. జాతీయ స్థాయిలో సైతం ఈ పేరు సుపరిచితం. 12వ లోక్సభ స్పీకర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు జిఎంసి బాలయోగి. అమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అనూహ్యంగా లోక్ సభ స్పీకర్ పదవి దక్కించుకున్నారు. కానీ 2002లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి దుర్మరణం పాలయ్యారు. కానీ ఆ కుటుంబం తరువాత రాజకీయంగా అంతగా ప్రభావితం చూపలేకపోయింది. కానీ ఈసారి ఆ కుటుంబం నుంచి ఆయన కుమారుడు హరీష్ మాధుర్ టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సైతం మాధుర్ పోటీ చేశారు. అప్పటికి ఆయన వయసు 28 సంవత్సరాలు. చంద్రబాబు పిలిచిటిక్కెట్ ఇచ్చారు.ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి చింతా అనురాధ 39,966 ఓట్లతో గెలుపొందారు. ఎన్నికల్లో హరీష్ మాధుర్ మరోసారి పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి అమలాపురం పై పడింది.
అమలాపురం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో కోనసీమ జిల్లా ఏర్పడింది. అప్పట్లో ఈ ప్రాంత అభివృద్ధిపై బాలయోగి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నెన్నో శాశ్వత నిర్మాణ పనులు చేపట్టారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అమలు చేశారు. 1991లో తొలిసారిగా టిడిపి తరఫున బాలయోగి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. లోక్సభ స్పీకర్ గా ఉండగానే 2002 మార్చిలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి విజయ కుమారి అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కానీ అటు తరువాత ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. గత ఎన్నికల్లో హరీష్ మాధుర్ పోటీ చేశారు. ఈసారి ఆయన గెలుపు పక్కా అన్న విశ్లేషణలు ఉన్నాయి.