Mary Saheli: ప్రతి సారి మన తోడుగా ఒకరు ఉంటారు అనుకోవడం కష్టమే. కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తుంటుంది. గ్రామాలకు, పట్టణాలకు, రాష్ట్రాలకు, దేశాలకు ఇలా ఎక్కడికి అయినా కొన్ని సార్లు ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. అయితే దూర ప్రయాణాలకు ఎక్కువగా రైలును ఎంచుకుంటారు. కానీ ఆ సమయంలో తోడుగా ఎవరు లేకపోతే ఎలా? కానీ ఈ సారి మీతోడు వీరు ఉంటారు. మాకు తెలియని వారా? ఎవరు అనుకుంటున్నారా?
మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల రక్షణ, భద్రత కోసం మేరీ సహేలి వరమనే చెప్పాలి. కొన్ని సార్లు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అభద్రతా భావం కలుగుతుంది. అలాంటప్పుడు ఎవరైనా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వారి కోసం మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు తోడుగా ఉంటారు.
మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు కూడా రైల్లోనే ప్రయాణం చేస్తారు. సాయం అడిగిన వెంటనే మీ ముందు ఉంటారు. ఒంటిరిగా ఉన్న వారి వివరాలు తెలుసుకొని సీటు వద్దకు వెళ్లి మరీ ఈ పథకం గురించి వివరిస్తారు. ఎలాంటి సాయం కావాలన్నా సంప్రదించమని ధైర్యం చెబుతారు. ఈ పథకంలో భాగంగా ఎంతో మంది సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ మీ ప్రయాణం లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా 182 నెంబర్ కు ఫోన్ చేయాలి.
మీ ఫోన్ వెళ్లిన వెంటనే ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు మీ వద్దకు వస్తారు. సీటు నెంబర్, గమ్యస్థానం వంటి వివరాలు కూడా తెలుసుకుంటారు. మీరు చేరే వరకు మీ బోగీపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. రైలు ఎక్కేందుకు, దిగేందుకు కూడా సాయం చేస్తారు ఈ సిబ్బంది. వీరి సేవలు 24 గంటలు అందుబాటులోనే ఉంటాయి. ఇప్పటికే ఈ సేవలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారట. మరి మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే 182కు కాల్ చేయండి. ఇంట్లో కాదు రైలు లో మాత్రమే సుమ. మరి జాగ్రత్త.