Homeఆంధ్రప్రదేశ్‌Vizag Google data center court case: విశాఖ గూగుల్ డేటా సెంటర్.. కోర్టుకు వైసిపి!

Vizag Google data center court case: విశాఖ గూగుల్ డేటా సెంటర్.. కోర్టుకు వైసిపి!

Vizag Google data center court case: ఏపీకి( Andhra Pradesh) భారీగా దిగ్గజ ఐటీ సంస్థలు తరలివస్తున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామం. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుండడం పై హర్షతిరేకాలు వ్యక్తం అయ్యాయి. దేశంలో చాలా రాష్ట్రాలు గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రయత్నాలు చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం నుంచి జరిగిన ప్రయత్నాలు.. డేటా పాలసీలో చేర్పులు మార్పులు.. కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి వంటివి ఫలించడంతోనే ఏపీకి గూగుల్ […]

Vizag Google data center court case: ఏపీకి( Andhra Pradesh) భారీగా దిగ్గజ ఐటీ సంస్థలు తరలివస్తున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామం. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుండడం పై హర్షతిరేకాలు వ్యక్తం అయ్యాయి. దేశంలో చాలా రాష్ట్రాలు గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రయత్నాలు చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం నుంచి జరిగిన ప్రయత్నాలు.. డేటా పాలసీలో చేర్పులు మార్పులు.. కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి వంటివి ఫలించడంతోనే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు 25 శాతం భూముల రాయితీ ఇవ్వడం పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి.

త్వరలో శంకుస్థాపన..
ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో( Visakhapatnam) ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. త్వరలో శంకుస్థాపనకు సైతం సన్నాహాలు మొదలయ్యాయి. అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి తన అనుబంధ సంస్థ పేరిట భూములను ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించింది. దానిని తప్పుపడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోర్టును ఆశ్రయించడం మాత్రం సంచలనంగా మారింది. పైగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భూగర్భ జలాలు అడుగంటుతాయని.. ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని పిటిషన్ లో పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది.

Also Read: ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ!

వ్యతిరేక ప్రచారం..
ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం తమకృషి అని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress party ) పార్టీ ప్రకటించుకుంది. అయితే ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసింది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వింత వ్యాఖ్యలతో సైతం మీడియా ముందుకు వచ్చారు. చివరకు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు భూముల కేటాయింపు పై, భూగర్భ జలాలు అడుగంటుతాయంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించడం పై మాత్రం ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది. అమ్మ తినను తినదు.. తిననివ్వదు అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper