HomeతెలంగాణShah Ghouse Restaurant Biryani: గ్యాస్ లేదు మహాప్రభో.. హైదరాబాద్ బిర్యానీ వండడానికి ఎన్ని కష్టాలో.....

Shah Ghouse Restaurant Biryani: గ్యాస్ లేదు మహాప్రభో.. హైదరాబాద్ బిర్యానీ వండడానికి ఎన్ని కష్టాలో.. వైరల్ వీడియో

Shah Ghouse Restaurant Biryani: ఇప్పుడు రంజాన్ మాసం. ముస్లింలు ఉపవాసం విడిచే క్రమంలో ఆహారం తీసుకుంటారు. ఉపవాస దీక్షల ముగింపు సమయంలో ముస్లింలు బలవర్ధకమైన బిర్యాని తినడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. హైదరాబాద్ నగరంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. పైగా నగరంలో బిర్యాని చాలా ఫేమస్. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.. ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు హైదరాబాద్ బిర్యాని తినడానికి నగరానికి వస్తుంటారు. హైదరాబాద్ నగరంలో బిర్యానీ తయారుచేసే హోటల్లు చాలానే ఉన్నాయి. అందులో షా […]

Shah Ghouse Restaurant Biryani: ఇప్పుడు రంజాన్ మాసం. ముస్లింలు ఉపవాసం విడిచే క్రమంలో ఆహారం తీసుకుంటారు. ఉపవాస దీక్షల ముగింపు సమయంలో ముస్లింలు బలవర్ధకమైన బిర్యాని తినడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. హైదరాబాద్ నగరంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. పైగా నగరంలో బిర్యాని చాలా ఫేమస్. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.. ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు హైదరాబాద్ బిర్యాని తినడానికి నగరానికి వస్తుంటారు.

హైదరాబాద్ నగరంలో బిర్యానీ తయారుచేసే హోటల్లు చాలానే ఉన్నాయి. అందులో షా అండ్ గౌస్ రెస్టారెంట్ ప్రముఖమైనది. ఈ రెస్టారెంట్ నిర్వాహకులు రంజాన్ రోజుల్లో బిర్యాని తోపాటు హలీం, కద్దు ఖా కీర్, హరీస్ వంటి వంటకాలను తయారు చేస్తుంటారు. రంజాన్ రోజుల్లో ఈ వంటకాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందువల్లే ఈ హోటల్ నిర్వాహకులు వీటిని విపరీతంగా తయారు చేస్తుంటారు. ప్రత్యేకంగా మాస్టర్లను పిలిపించి డిమాండ్ కు తగ్గట్టుగా వంటకాలను తయారుచేసి.. బిజినెస్ సాగిస్తుంటారు.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ రావడం లేదు. హా
ర్మోజ్ జల సంధి లో గ్యాస్ రవాణా ఆగిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా వంట గ్యాస్ మీద ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కేవలం హాస్పిటల్స్, హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేయాలని సూచించింది. దీంతో పెద్ద పెద్ద హోటల్స్ మొత్తం మూతపడ్డాయి.

Also Read: ఇక దోశ, ఇడ్లీలకు కష్టమే.. ఇప్పట్లో తినలేరు..

హైదరాబాద్ నగరంలో రంజాన్ సమయంలో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో షా అండ్ గౌస్ హోటల్ యాజమాన్యం బిర్యానీని కట్టెల పొయ్యిల మీద తయారు చేస్తోంది. ప్రత్యేకమైన కిచెన్ ఏర్పాటు చేసి.. భారీగా హాండీలలో బిర్యాని.. ఇతర వంటకాలను తయారు చేస్తోంది. గ్యాస్ లభ్యత లేకపోవడంతో వంట చెరుకుకు కూడా డిమాండ్ పెరిగిందని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. ఆయన ఇప్పటికీ వినియోగదారుల ఆత్రుతను దృష్టిలో పెట్టుకొని తాము కట్టెల పొయ్యిల మీద బిర్యాని తయారు చేస్తున్నామని షా అండ్ గౌస్ హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper