Homeఆంధ్రప్రదేశ్‌AP TDP president post competition: ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆ ఇద్దరి...

AP TDP president post competition: ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ!

AP TDP president post competition: టిడిపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నుంచి పల్లా శ్రీనివాసును తప్పిస్తారా? కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందా? అయితే ఎవరికి అవకాశం ఇస్తారు? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే అధ్యక్షుడిగా కొత్త నేత ఎవరు అనేది హాట్ టాపిక్.. అయితే ఆది నుంచి టిడిపి అధ్యక్ష పదవి అనేది బీసీ నేతలకు కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే మరోసారి బీసీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరూ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారే. వీరిలో ఒకరికి టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది.

బీసీలకు చాన్స్..
2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ( Telangana), ఏపీకి వేరువేరుగా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేటాయిస్తూ వచ్చారు. చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా.. రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తూ వచ్చారు. 2014లో తొలిసారిగా తూర్పు కాపు నేత కళా వెంకట్రావుకు ఛాన్స్ ఇచ్చారు. తూర్పు కాపు అంటే బీసీ సామాజిక వర్గం కిందకి వస్తుంది. అటు తరువాత కింజరాపు అచ్చెనాయుడుకు అవకాశం ఇచ్చారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో అప్పట్లో ఛాన్స్ దక్కింది. అటు తరువాత పల్లా శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇలా బీసీలకు అవకాశం ఇచ్చారు.

కొల్లు లేదా అనగాని..
అయితే తాజాగా కొల్లు రవీంద్ర కు( kollu Ravindra ) కానీ.. అనగాని సత్యప్రసాద్ కు కానీ.. ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. రేపల్లె నుంచి మూడుసార్లు వరుసగా గెలిచారు అనగానే సత్యప్రసాద్. 2019లో సైతం గెలిచారు. ఎన్ని రకాల ప్రలోభాలు ఎదురైన పార్టీలోనే కొనసాగారు. అందుకే మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఈసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొల్లు రవీంద్ర పేరు కూడా వినిపిస్తోంది. రెండుసార్లు ఆయన మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తొలిసారిగా గెలిచిన కొల్లు రవీంద్రకు క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. 2024లో రెండోసారి గెలవగా మంత్రిగా అవకాశం కల్పించారు. ఆయన కు సైతం టిడిపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. చూడాలి ఛాన్స్ ఎవరికి దక్కుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular