Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: చీడను తరిమేసే పనిలో సాయి రెడ్డి.. వీడియో వైరల్!

Vijayasai Reddy: చీడను తరిమేసే పనిలో సాయి రెడ్డి.. వీడియో వైరల్!

Vijayasai Reddy: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే వన్ ఫైన్ మార్నింగ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత ఆయన వ్యవసాయం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా పెట్టారు. కానీ మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టారు.. తనకు రాజకీయ కాంక్ష ఉందని చెప్పుకొచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు విసుగు చెందారు ఏమో.. మళ్లీ వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!

* వైయస్ కుటుంబ సన్నిహితుడిగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) అత్యంత సన్నిహితుడిగా మెలిగారు విజయసాయిరెడ్డి. ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి వైయస్ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండేవారు. అలా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగారు. జగన్ పై వచ్చిన అవినీతి అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా కూడా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి తో కలిసి 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కూడా ఎంతగానో కృషి చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఆయనకు గ్యాప్ ఏర్పడింది. అలా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు.

* వ్యవసాయ క్షేత్రంలో పనులు..
అయితే ప్రారంభంలో విజయసాయిరెడ్డి బాగానే వ్యవసాయం చేసినట్టు ఉన్నారు. కానీ ఆయనకు మళ్ళీ రాజకీయం వైపు మనసు మళ్లింది. అందుకే మద్యం కుంభకోణం కేసులో అడగకుండానే సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. విశేషం ఏమిటంటే ఆయన కేసులో ఒక నిందితుడు కూడా. అయితే ఆయన సాక్షిగా వచ్చారో? నిందితుడిగా వచ్చారో తెలియదు కానీ చాలా సందర్భాల్లో విచారణకు అయితే హాజరయ్యారు. ఏదో ఒక పార్టీలో చేరాలని ఉందని మళ్లీ రాజకీయ ఆసక్తి కనబరిచారు. అయితే ఇప్పుడు మరోసారి వ్యవసాయం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సొంత జిల్లా నెల్లూరులోని శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో.. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా మిరప చెట్లకు స్ప్రే చేస్తూ కనిపించారు సాయి రెడ్డి. అందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆయనే పోస్ట్ చేశారు. అగ్నాస్త్రం తయారీకి సంబంధించిన విధానాన్ని కూడా వివరించారు. అంటే సమాజంలో చీడను ఏరినట్టే.. సాగులో చీడను తరిమేసే పనిలో ఉన్నారన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper