Homeలైఫ్ స్టైల్D Mart Shopping Tips: డీమార్ట్ కు ఏరోజు వెళ్లాలి? ఎప్పుడు కొనాలి.. ఇది తెలిస్తే...

D Mart Shopping Tips: డీమార్ట్ కు ఏరోజు వెళ్లాలి? ఎప్పుడు కొనాలి.. ఇది తెలిస్తే మీకు ఎంతో లాభం

D Mart Shopping Tips: భారతదేశంలో సూపర్ మార్కెట్ వేరియంట్ లో గుర్తింపు పొందింది డీ మార్ట్ (D-Mart). తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఒకే చోట కిరాణా సామగ్రి, పండ్లు, కూరగాయలు, గృహోపకరణాలు, దుస్తులు, కిచెన్ వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, స్టేషనరీ, ప్లాస్టిక్ వస్తువులు వంటి వేలాది ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దీంతో చాలా మంది ఆయా పట్టణాల్లో ఉండే ఈ స్టోర్లకు రావడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇందులోకి వెళ్లి తిరిగి రావడం అంటే పెద్ద ప్రయాసగా మారింది. ప్రముఖ నగరాల్లో ఈ స్టోర్లలో ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఈ రద్దీలో కాకుండా ప్రశాంతంగా వస్తువులు కొనుగోలు చేయాలంటే ఈ ట్రిక్ పాటించాలని కొందరు చెబుతున్నారు. అదేంటంటే?

ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే డీమార్ట్ ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. దీంతో నిత్యావసర వస్తువులు, కిరాణా, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారు ఇక్కడికి వస్తుంటారు. అయితే కొన్ని రోజుల్లో స్టోర్‌లో భారీ రద్దీ ఉండగా, మరికొన్ని రోజుల్లో ప్రశాంతంగా షాపింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డీ మార్ట్‌లో నెల మొదటి వారంలో రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు అందే సమయం ఇదే. జీతం ఖాతాలో జమ అయిన వెంటనే చాలామంది కుటుంబాలు నెలకు అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలు, కిరాణా సామగ్రి, శుభ్రత ఉత్పత్తులు, గృహోపకరణాలు వంటి వస్తువులను ఒకేసారి కొనుగోలు చేయడానికి డీ మార్ట్‌కు వెళ్తుంటారు. దీంతో నెల ప్రారంభంలో స్టోర్లలో వినియోగదారుల రాక గణనీయంగా పెరుగుతుంది.

నెల మొదటి వారం శనివారం లేదా ఆదివారం వస్తే రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ఉద్యోగాలకు సెలవు ఉండటంతో కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్‌కు రావడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిల్లింగ్ కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తుంటాయి. పార్కింగ్ ప్రాంతాల్లో కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అధిక రద్దీ కారణంగా షాపింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. బిల్లింగ్ కోసం ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సి రావచ్చు. అలాగే డిస్కౌంట్ లేదా ప్రత్యేక ఆఫర్లలో ఉన్న కొన్ని ప్రముఖ ఉత్పత్తులు త్వరగా అమ్ముడైపోవడం వల్ల వినియోగదారులు కోరుకున్న వస్తువులు దొరకకపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. పిల్లలతో వెళ్లే కుటుంబాలకు రద్దీ మరింత అసౌకర్యంగా అనిపించవచ్చు.

ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే ఎప్పుడు వెళ్లాలి?
రిటైల్ రంగ నిపుణుల సూచనల ప్రకారం.. నెలలో 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య డీ మార్ట్‌లో సాధారణంగా రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది ఇప్పటికే నెలవారీ కొనుగోళ్లు పూర్తి చేసుకుని ఉంటారు. దీంతో స్టోర్‌లో సౌకర్యంగా వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది. సోమవారం నుంచి గురువారం వరకు డీమార్ట్ లోకి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో సాధారణంగా వీకెండ్‌తో పోలిస్తే వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. శుక్రవారం సాయంత్రం నుంచే వీకెండ్ షాపింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో రద్దీ పెరగవచ్చు.

స్టోర్ తెరిచిన వెంటనే ఉదయం వెళ్లడం లేదా మధ్యాహ్నం ప్రారంభ సమయంలో వెళ్లడం ఉత్తమం. ఈ సమయంలో బిల్లింగ్ కౌంటర్ల వద్ద క్యూలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సాయంత్రం ఉద్యోగాలు ముగిసిన తర్వాత వచ్చే సమయంతో పోలిస్తే ఉదయం షాపింగ్ మరింత వేగంగా పూర్తవుతుంది. షాపింగ్‌కు ముందు అవసరమైన వస్తువుల జాబితా సిద్ధం చేసుకోవడం మంచిది. దీంతో అనవసర ఖర్చులు తగ్గుతాయి. డిస్కౌంట్ ఉందని అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండాలి. ఆఫర్ ఉత్పత్తులపై గడువు తేదీ, పరిమాణం, ధరలను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. వీలైతే డిజిటల్ చెల్లింపులు ఉపయోగించడం వల్ల బిల్లింగ్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular