Homeఆంధ్రప్రదేశ్‌Thalliki vandanam to all: 'తల్లికి వందనం'లో నిబంధన తొలగింపు.. లక్షల మందికి లబ్ధి!

Thalliki vandanam to all: ‘తల్లికి వందనం’లో నిబంధన తొలగింపు.. లక్షల మందికి లబ్ధి!

Thalliki vandanam to all: ఏపీలో( Andhra Pradesh) తల్లికి వందనం పథకం సందడి నెలకొంది. బ్యాంకులు రద్దీగా మారుతున్నాయి. ఇంకోవైపు వస్తువుల కొనుగోలుతో మార్కెట్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 12న విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. అదే రోజు తల్లికి వందనం నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తల్లుల ఖాతాలలో నిధులు జమ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. అయితే డబ్బులు ఖాతాలలో పడని వారు లబో దీపం అంటున్నారు. తమనెందుకు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారంటూ గ్రామ సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అయితే మీరంతా నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించారని చెబుతుండడంతో షాక్ కు గురవుతున్నారు. అయితే తాము అంత విద్యుత్ వాడలేదని వారు చెబుతున్నారు. అటు నుంచి అటే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. అయితే అనర్హుల జాబితాలో ప్రతి మండలం నుంచి వేలాదిగా ఉండడంతో వారు మండల కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Also Read: Pawan Kalyan Report Card : పవన్ కళ్యాణ్ పాలన రిపోర్ట్ కార్డు ఎలా ఉంది?

సచివాలయాల్లో గ్రీవెన్స్..
ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం(Thalliki vandanam) పథకానికి సంబంధించి ఖాతాలో సొమ్ము పడినవారు సంతోషంగా ఉన్నారు. పడని వారు మాత్రం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ముందుగా స్థానిక సచివాలయాల్లో ఆరా తీస్తున్నారు. విద్యుత్ వినియోగం అధికం గా ఉందన్న సమాధానం రావడంతో మండల విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్తున్నారు. తమ కరెంట్ బిల్లు తక్కువగా వచ్చినా.. ఎందుకు ఎక్కువగా చూపారంటూ నిలదీస్తున్నారు. తాము వాడిన విద్యుత్ వినియోగానికి సంబంధించి స్టేట్మెంట్ కోరుతున్నారు. అయితే అది తమ చేతిలో లేదని.. కేవలం 6 నెలలు మాత్రమే స్టేట్ మెంట్ ఇవ్వగలమని తేల్చి చెబుతున్నారు. అయితే సచివాలయ సిబ్బంది మాత్రం 12 నెలల స్టేట్మెంట్ అడుగుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది ఈ కారణంతోనే తల్లికి వందనం పథకానికి దూరం కావడంతో.. ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సచివాలయాల్లో ఫిర్యాదుల విభాగానికి వినతులు ఇచ్చుకోవాలని సూచించింది.

Also Read:  AP Talliki Vandanam Update: చంద్రబాబు మరో సంచలనం.. తల్లికి వందనం రెడీ.. 67 లక్షల తల్లులకు గుడ్ న్యూస్

విద్యుత్ వినియోగం నిబంధన తొలగింపు
ఈనెల 20 వరకు ఫిర్యాదు చేసుకోవచ్చు. 21 నుంచి 28 వరకు ఫిర్యాదులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారు. అప్పుడు అర్హత సాధిస్తే అర్హుల జాబితాలో పేరు చేర్చుతారు. ఈనెల 30న సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. జూలై 5న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, ప్రతిపక్షాలకు ఇది ప్రచార అస్త్రంగా మారడం, గతంలో వైసిపి ఇదే నిబంధనను తెరపైకి తేగా అప్పట్లో వ్యతిరేకించడం… వంటి కారణాలతో ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ వినియోగానికి సంబంధించి అనర్హులను అర్హులుగా తేల్చి.. వారి ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఫిర్యాదులను పక్కన పెట్టాలని.. వారందరి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper