Pawan Kalyan Report Card : పవన్ కళ్యాన్ నిన్న సంవత్సర పాలన పూర్తి అయిన సందర్భంలో తన రిపోర్ట్ కార్డును జనం ముందు పెట్టాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఒక ఏడాది అయ్యింది. సంవత్సరం పాలనలో తను చేసిన పనులపై రిపోర్ట్ బయటపెట్టారు.
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ , సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్లో ఏమేం పనులు చేశాడో బయటపెట్టాడు. 1312 కి.మీల రోడ్లు, 645 కోట్ల పనులతో పూర్తి చేశాడు. 419 ప్రాంతాలకు కొత్త రోడ్లు వేశారు. కేంద్రం నుంచి 589 కోట్లు, పీఎం జన్మన్ పంచాయితీ నుంచి 605 కోట్లు, నాబార్డ్ 555 కోట్లు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 8వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. 10వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు.
జలజీవన్ పథకం కింద 1191 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం 84750 కోట్ల పథకంలో 26వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే మూడేళ్లలో లక్ష్యం చేరనున్నట్టు తెలిపారు.
పవన్ కళ్యాణ్ పాలన రిపోర్ట్ కార్డు ఎలా ఉంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.