Homeఆంధ్రప్రదేశ్‌Shocking Twist: పెళ్లి ఆపాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పొయింది.... వధువు మృతి కేసులో షాకింగ్...

Shocking Twist: పెళ్లి ఆపాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పొయింది…. వధువు మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్

Shocking Twist: పెళ్లి ఆపాలనుకున్న ప్రయత్నం యువతి ప్రాణాలను తీసింది. ప్రేమించిన వాడిని దక్కించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదు. పెళ్లి మండపంలో వధువు ప్రాణం విడిచింది. కన్నవారికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.విశాఖలో పెళ్లి పీటలపై వధువు సృజన కన్నుమూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు అసలేం జరిగింది..? వధువు విషం తాగిందా? లేకుంటే ఆరోగ్య సమస్యలా..? ప్రీ-వెడ్డింగ్ షూట్ కూడా పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఇలా జరగడంతో అందరూ ఒకింత షాకయ్యారు. అయితే ఇప్పటి వరకూ అటు వధువు కుటుంబీకులు.. ఇటు వరుడు కుటుంబీకులు ఇరువురూ స్పందించినప్పటికీ అన్నీ ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు.. కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది. ఫోన్ కాల్ రికార్డ్స్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆమె మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సృజన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు కాల్ రికార్డ్స్ నిశితంగా పరిశీలించగా అసలు విషయాలన్నీ బయటికొచ్చేశాయి. పెళ్లి ఆపాలనే పక్కా ప్లాన్‌తోనే వధువు ఇలా చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు.. సృజన ఓ యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి అపాలనుకొనే ప్రయత్నంలోనే సృజన ఇలా ప్రాణాలు తీసుకుందని తేటతెల్లమైంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చేశారు. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ కూడా చేసిందని పోలీసులు చెబుతున్నారు. అందులో పెళ్లి ఆపేందుకు తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తానని ప్రియుడికి హామీ ఇచ్చింది. సృజన అనుకున్నట్లుగానే ఆత్మహత్యకు ప్రయత్నించే క్రమంలో కన్నుమూసింది. అయితే దీనిపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ చివరకు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు పురిగొలిపిందని తెలియడంతో బాధిత కుటుంబసభ్యలు విషాదంలో మునిగిపోయారు.

Shocking Twist
Srujana

Also Read: KTR, Jagan key Meeting In London: కలిసే పోదాం : లండన్‌లో కేటీఆర్, జగన్‌ కీలక భేటీ!? ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు!!

ప్రేమ వ్యవహారమే కారణం

పరవాడకు చెందిన తోకాడ మోహన్-సృజన ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను అడుగుదాం లేకుంటే.. బయటికెళ్లి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి అనే టాపిక్ వచ్చినప్పుడల్లా తనకు సరైన ఉద్యోగం లేదని కొంత సమయం కావాలని సృజనకు మోహన్ చెప్పేవాడు. అయితే ఇంతలోనే సృజనకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌పై సృజన మరింత ఒత్తిడి పెంచింది. తనను ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోవాలని ప్రియుడిని కోరింది. తన కోసం రెండేళ్లు ఆగాలని ఇదే లాస్ట్ ఛాన్స్ అని సృజనను ప్రియుడు కోరాడు. అంతేకాదు ఈ పెళ్లి కూడా చేసుకోవడానికి వీల్లేదని.. పెళ్లి ఆపేస్తానని తనకు హామీ కూడా ఇవ్వాలని ప్రియుడు కోరాడు .
చివరికి విషం తాగింది. ఈ నేపథ్యంలో ముహూర్తానికి కొద్దిసేపటికి ముందే విషయం తీసుకుంది. వరుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.. దీంతో సృజన ఒక్కసారిగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయి మృతి చెందింది. కాగా మొదట్నుంచీ ఆస్పత్రి డాక్టర్లు.. సృజన విషం తాగిందనే చెబుతున్నారు.. చివరికీ అదే నిజమైంది కూడా. మొత్తానికి చూస్తే.. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మిస్టరీ కేసును పోలీసులు ఇలా ఛేదించారు.

చాటింగ్ తో..

మోహన్, సృజన ఇద్దరూ చాటింగ్ లో ఈ మొత్తం విషయాలను ఎప్పటికప్పుడు చాటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్క ఇన్‌స్టాలోనే కాదు.. వాట్సాప్‌లో కూడా ఎప్పటికప్పుడు తమ అభిప్రయాలను పంచుకున్నారు. కానీ ఎవరికీ తెలియకూడదని డిలీట్ కూడా చేసేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే చివరగా పెళ్లి ఆపేస్తానని సృజన.. ప్రియుడికి మాటిచ్చిందని ఛాటింగ్ ద్వారా తెలిసింది. అయితే పెళ్లి ఆపాలని మాత్రమే వాళ్ల ప్లాన్ కానీ.. అనుకోకుండా చావుదాకా వెళ్లింది.

Also Read: MLC Driver Subrahmanyam: డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే.. ఇంతకీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ఏమైనట్టు?

Recommended Videos:

https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular