Akira Plays Piano For Mahesh Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ‘అకీరా నందన్’ సన్నద్ధం అవుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. సినిమాల్లోకి రావడానికి ముందు పవన్ ఎలా అయితే సన్నద్ధమయ్యాడో, అలానే పవర్ స్టార్ వారసుడు అకీరా కూడా సమాయత్తమవుతున్నాడు. పైగా అకీరా సంగీతం కూడా నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అకీరా కీబోర్డ్ ప్లేయర్ గా తన టాలెంట్ ఏమిటో చూపించాడు.

అకీరా కీబోర్డ్ ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ ను అకీరా ప్లే చేస్తూ కనిపించాడు. దీంతో, మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అకీరా ఇప్పటికే కత్తిసాము, కర్రసాము నేర్చుకున్నాడు. అలాగే కిక్ బాక్సింగ్ కూడా ప్రస్తుతం నేర్చుకుంటున్నాడు.

ఇంతకీ, అకీరా ఎలాంటి కథతో సినిమాల్లోకి రాబోతున్నాడు అని అందరికీ ఉన్న ఆసక్తి. కాగా ఆ మధ్య టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ‘నీరజ్ చోప్రా’ బయోపిక్ తీయాలని చాలామంది ప్లాన్ చేశారు. ఆ విజేత ఆత్మ కథనే సినిమాగా తీయాలని సినిమా వాళ్ళు ఉత్సాహ పడుతున్నారు.
Also Read: Janasena And BJP: 175 స్థానాల్లో నిలబెట్టడానికి జనసేన, బీజేపీకి క్యాండిడేట్స్ ఉన్నారా?
‘నీరజ్ చోప్రా’ కథ వింటే ఎవరిలోనైనా ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది. అతని జీవితంలో గొప్ప పోరాటం ఉంది. చిన్న తనం నుండే.. అతను కాలంతో యుద్ధం చేశాడు. క్షణక్షణం తన పరిధిని పరిమితిని పెంచుకుంటూ పోయాడు. అన్నిటికీ మించి మరెన్నో మలుపులు నీరజ్ జీవితంలో ఉన్నాయి. కష్టాలు అవమానాలు మధ్య అతను జీవితం సాగింది.
అతను అనుభవించిన ప్రతి బాధను తన విజయానికి పునాదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా ఒక సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు నీరజ్ జీవితంలో ఉన్నాయి. అందుకే, అతని కథలో కల్పితాలు కలపక్కర్లేదు. ఉన్న నిజాన్ని ఉన్నట్టుగానే చెప్పినా.. అద్భుతమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అవుతుంది ఆ సినిమా.

అయితే, నీరజ్ ఫిజిక్, వయసుకు అతని బయోపిక్ లో కరెక్ట్ గా సరిపోయే కొత్త నటుడు అంటే ‘అకీరా నందన్’నే గుర్తుకువస్తున్నాడట. పైగా , ఫిజిక్ అండ్ ఏజ్ పరంగా అకీరా నందన్, నీరజ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. పైగా పవర్ స్టార్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ‘అకీరా నందన్’కి ఇంతకుమించిన గొప్ప కథ దొరకదు. మరి, పవన్ ఫ్యాన్స్ సంతోషం కోసమైనా ‘అకీరా నందన్’, నీరజ్ చోప్రా పాత్రలో నటిస్తాడేమో చూడాలి.
Also Read: Super Singer Junior: అనసూయతో సుడిగాలి సుధీర్.. ప్రేక్షకులకు పండుగే
View this post on Instagram
Recommended videos
[…] […]
[…] […]
[…] […]
[…] […]