Naga Chaitanya With Flop Director: మ్యాటర్ ఉండి కూడా సరైన సక్సెస్ రాకపోతే కలిగే బాధ, ఎదిగే అవకాశం ఉండి కూడా సరిగ్గా ఎదగలేకపోతే రగిలే ఆవేదన.. రెండు మాటల్లో చెప్పుకునేది కాదు. ఆ బాధ ఆవేదన రెండూ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జీవితంలో నిత్యం పోటీ పడుతూ ఉంటాయి. ఒక్క బొమ్మరిల్లు తప్ప, ఆయన తీసిన ఏ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

ఎప్పటి నుంచో మరో భారీ హిట్ కొట్టి, తన చిరకాల కోరిక తీర్చుకుని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో సగర్వంగా తన పేరును చూసుకోవాలని బొమ్మరిల్లు భాస్కర్ ఎంతో ఆశ పడుతున్నాడు. కానీ, ఆ హిట్ మాత్రమే రావడం లేదు. దాంతో ఆయన తన తర్వాత సినిమా ఏం చేయాలి అనే క్వశ్చన్ దగ్గరే ఎంతో మధనపడి, మొత్తానికి హీరో చైతుతో ఒక సినిమాని సెట్ చేసుకున్నాడు.

Also Read: Akira Plays Piano For Mahesh Song: మహేష్ పాటకు… పియానో వాయించిన పవన్ వారసుడు ‘అకీరా’ !
నాగచైతన్య తన కొత్త సినిమా ‘థ్యాంక్ యూ’ సినిమాను దాదాపు పూర్తి చేశాడు. అలాగే వెంకట్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే, దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో కూడా చైతు ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఖరారైంది కూడా.

చైతు ఇంత బిజీగా ఉండి కూడా.. ఇప్పుడు మరో సినిమాని ఒకే చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో చైతు సినిమా ఓకే అయ్యింది. ఎకే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించబోతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని భాస్కర్ ప్రయత్నం చేశాడు. ఫామ్ లోకి రాకపోయినా.. ఎలాగోలా ఏవరేజ్ హిట్ అందుకున్నాడు.
అందుకే, నాగచైతన్యతో వెంటనే భాస్కర్ కి డేట్లు ఇచ్చేశాడు. ఈ చిత్రం ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మరో ఐదు నెలల్లో ఈ సినిమా పూర్తవుతుంది. ఇప్పటికే కథని లాక్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.
Also Read: KCR Delhi Tour: సంచలనమన్న కేసీఆర్.. సడీ సప్పుడు లేని కేజ్రీవాల్, అఖిలేష్!
Recommended videos
[…] […]
[…] […]