Divvala Madhuri Viral Video: దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) షాక్ ఇచ్చారు దివ్వెల మాధురి. ఆమె తన సొంత భర్త వద్దకు వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి జతకట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల తరువాత టెక్కలిలో పెద్ద సంగ్రామం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంట్లోకి భార్యా పిల్లలు ప్రవేశించగా.. అది నా ఇల్లు అంటూ మాధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్కు గురయ్యారు. అయితే ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మధ్య కోర్టు వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చాక తాము వివాహం చేసుకుంటామని ఆ జంట చాలా సార్లు చెప్పుకొచ్చింది.
వస్త్ర వ్యాపారంలో జంట..
ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, మాధురి( Madhuri) వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నారు. కొద్ది నెలలు కిందట హైదరాబాదులో వకులా చీరలు పేరిట ఒక షాప్ ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో బిజీగా ఉన్నారు. ఆ వ్యాపారానికి సంబంధించి ఆమె సొంతంగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో మాధురి తన భర్త మహేష్ చెంత కు తిరిగి చేరారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఎపిసోడ్ ప్రారంభంలో ఆమె భర్త మహేష్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన భార్యపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. ఆమెపై వస్తున్న వార్తలను తాను నమ్మనని ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అటు తరువాత మహేష్ కనిపించలేదు.
Also Read: అమరావతి’కి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు!
బాబా అంటూ పూల వర్షం..
అయితే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. మాధురి తన భర్త మహేష్ ను ( Mahesh) వెతుక్కుంటూ వెళ్లిపోయారన్నదే ఆ వార్త సారాంశం. మహేష్ పై పూల వర్షం కురిపిస్తూ.. జై కొడుతూ మాధురి చాలా రకాలుగా కామెంట్లు చేశారు. జై మహేష్ బాబా అంటూ ఆయన సేవకురాలిగా అవతారం ఎత్తారు. ఆయనపై పూలు చల్లుతూ.. కొత్త బాబా వచ్చాడని.. ఆడపిల్లలను పుట్టిస్తాడంటూ ఆమె చేసిన కామెంట్స్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు. దువ్వాడ శ్రీనివాస్ చెంతకు చేరకముందు.. భర్త మహేష్ తో కలిసి ఉన్న వీడియో అది అని తెలుస్తోంది. దానిని దువ్వాడకు ట్యాగ్ చేసి కొందరు ఆడేసుకుంటున్నారు.