Bigg Boss 9 Contestants: ప్రస్తుతం ప్రేక్షకులు యొక్క అభిరుచి మారిపోయింది. రొటీన్ రొట్ట సినిమాలనే కాకుండా కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ మంచి కథలతో వచ్చిన సినిమాలను చూస్తున్నారు. అలాగే రియల్టీ షో ల విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ తగ్గడం లేదు. వాళ్ళను ఎగ్జైట్ చేస్తూ వచ్చే షో లను చూడడానికి వాళ్ళ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు విశేషం…మరి ఇప్పటివరకు 8 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో మీద ప్రతి ప్రేక్షకుడికి చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ షో ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు అలాంటి షో మరొకటి రాలేదంటూ చాలా మంది ఈ షో మీద చాలా మంచి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ షో కి కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తారు అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. గత ఎనిమిది సీజన్లో కంటెస్టెంట్లు చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. వాళ్ళు బిగ్ బాస్ షో కి ఎంత యూస్ అయ్యారో, బిగ్ బాస్ షో వాళ్ళకి కూడా అంతే యూజ్ అయింది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రాబోతున్న కంటెస్టెంట్లు ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే నాగార్జున ఈ షో కి హోస్టు గా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
నాగార్జున క్లోజ్ ఫ్రెండ్ అయిన నటుడు వెంకట్ ఈ సీజన్ లో ఈ షో కి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ‘సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’ అనే తన మొదటి సినిమాను చేశాడు. ఆ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఒక రకంగా ఆయనను అక్కినేని హీరోగాని ఇండస్ట్రీలో పిలుస్తూ ఉంటారు.
కారణం ఏంటి అంటే ఆయనను ఇంట్రడ్యూస్ చేసింది అక్కినేని వాళ్ళే…అలాగే వాళ్ళ బ్యానర్ లోనే అతను సినిమాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి అతనికి అలాంటి గుర్తింపైతే లభించింది. ఇక వెంకట్ నాగార్జునకి మొదటి నుంచి చాలా మంచి ఫ్రెండ్ గా ఉంటున్నాడు.
Also Read: బిగ్ బాస్ 9 లో బాలయ్య బాబు హీరోయిన్ కి చోటు దక్కిందట…ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..?
కాబట్టి తనను తీసుకోమని నాగార్జున సజెస్ట్ చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో కనక తను ఉంటే అతనికి మంచి క్రేజ్ దక్కుతుందనే చెప్పాలి. ఒకవేళ తను వచ్చి టాస్క్ లు బాగా ఆడితే మరోసారి ఆయన మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి…అలాగే సినిమాల్లో అవకాశాలు కూడా రావచ్చు…