Vizag Mega Sabha: ఉత్తరాంధ్రపై( North Andhra) జనసేన ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రలో బలం పెంచుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విశేష ప్రభావం చూపింది జనసేన. సీట్లతో పాటు ఓట్ల పరంగా మంచి మార్కులే సాధించింది. అందుకే దానిని కొనసాగిస్తూ.. మరింత బలంగా ముందుకెళ్లాలని చూస్తోంది. అందులో భాగంగా ఈనెల 30న విశాఖ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా చేస్తోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత పార్టీ పరంగా ఇది రెండో సభ. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ సభ జరగనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనసేనకు పట్టున్న ప్రాంతం కావడంతో సభ భారీ స్థాయిలో జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
Also Read: నాగబాబు, పవన్ లు ఇది గుర్తించాలి.. వీరి బాధ వినాలి
పట్టున్న ప్రాంతం..
గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు పట్టున్న ప్రాంతం విశాఖ( Visakhapatnam). మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి అన్నిచోట్ల గెలిచింది. విశాఖ దక్షిణం, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి, చోడవరంలో ఘనవిజయం సాధించింది. అదే సమయంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గాలను సైతం కైవసం చేసుకుంది. అటు కూటమి గెలుపులో కీలకపాత్ర పోషించింది. అయితే ఈసారి ఉత్తరాంధ్రలో ఇప్పుడు లభించిన ఏడు స్థానాలతో పాటు మరి కొన్ని స్థానాల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తికానుంది. ఉత్తరాంధ్రలో పెరిగే సీట్లపై ఇప్పటినుంచి ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. దీనిపై పార్టీ శ్రేణులకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.
విశాఖ కీలకం
విశాఖలో కూటమి నిలబడాలి అంటే జనసేన( janasena ) మద్దతు కీలకము. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ పట్టు కోసం ఆరాటపడుతూనే ఉంది. కానీ పట్టు పెంచుకోలేకపోతోంది. అయితే గత ఎన్నికల్లో జనసేన మద్దతు కూటమికి దక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయింది. ఇక్కడ పవన్ అభిమానులు అధికం. కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే జనసేన ఇక్కడ ఎంత బలోపేతం అయితే కూటమికి అంత లాభం. అందుకే ఈనెల 30న జనసేన విస్తృత స్థాయి సభకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించనుంది. చాలా రోజుల తర్వాత జనసేన సభ కావడంతో ఆ పార్టీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: ఫ్రస్టేషన్ లో జనసేన ఎమ్మెల్యేలు..’సర్దుకుపోవడం’ పై అసంతృప్తి!
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం..
ఇటీవల కూటమిలో సమన్వయ లోపం కనిపిస్తోంది. ప్రధానంగా జన సేన అభిమానులు సోషల్ మీడియాలో తలోవైపుగా మాట్లాడుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్( Pawan Kalyan) పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడికక్కడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ట్రాప్ చేస్తోంది. దానికి చెక్ చెప్పాలంటే పార్టీ శ్రేణులకు ఒక కీలక పిలుపు అవసరం. కచ్చితంగా పార్టీ బలోపేతంపై సూచనలు చేస్తూనే.. పవన్ కళ్యాణ్ పార్టీలో గాడి తప్పుతున్న సమన్వయ లోపాన్ని కూడా సరిచేసే అవకాశం ఉంది. అందుకే ఈ సమావేశం పార్టీ శ్రేణులతో పాటు కూటమికి ప్రతిష్టాత్మకం.