Homeఆంధ్రప్రదేశ్‌Pulivendula Politics: పులివెందులలో ఓటమి తప్పదా.. బౌన్సర్ల మధ్య వైసిపి ప్రచారం అందుకేనా..

Pulivendula Politics: పులివెందులలో ఓటమి తప్పదా.. బౌన్సర్ల మధ్య వైసిపి ప్రచారం అందుకేనా..

Pulivendula Politics: పులివెందులలో వైయస్ కుటుంబానికి విపరీతంగా క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అది తగ్గి పోయిందా.. దీనికి అవును అనే సమాధానమే వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో దృశ్యాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వైసిపి తరఫున పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా జగన్ బాబాయి వైయస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మ పోటీలో ఉన్నారు. ఇటీవల ప్రమీలమ్మ అభ్యర్థిత్వాన్ని […]

Pulivendula Politics: పులివెందులలో వైయస్ కుటుంబానికి విపరీతంగా క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అది తగ్గి పోయిందా.. దీనికి అవును అనే సమాధానమే వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో దృశ్యాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వైసిపి తరఫున పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా జగన్ బాబాయి వైయస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మ పోటీలో ఉన్నారు. ఇటీవల ప్రమీలమ్మ అభ్యర్థిత్వాన్ని జగన్ ప్రకటించారు..

స్థానిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రమీలమ్మ.. మనోహర్ రెడ్డి చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇది రాజకీయంగా సంచలనంగా మారింది. పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారు. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటిది. అక్కడ ప్రతి కుటుంబంతో వైఎస్ ఫ్యామిలీకి దగ్గర సంబంధాలుంటాయి. అలాంటి చోట బౌన్సర్లు కాదు కదా.. అంగరక్షకులు కూడా లేకుండా వెళ్లొచ్చు. కానీ ప్రమీలమ్మ.. మనోహర్ రెడ్డి బౌన్సర్ల సహాయంతో ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి వైయస్ కుటుంబం పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.

కడప జిల్లాలో వైఎస్ కుటుంబం కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బయపడి.. బౌన్సర్ల సహాయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందుల ప్రజలు తమ వెంట ఉన్నారని చెప్పుకునేవారు.. ఇప్పుడు జనంలో తిరగలేక బౌన్సర్లను పెట్టుకొని.. భయం భయం మధ్య తిరుగుతున్నారని.. ఇది వారి నైతిక పతనానికి నిదర్శనమని టిడిపి నేతలు ఆరపిస్తున్నారు. వయస్ కుటుంబం తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలలో ఎవరు పోటీ చేసినా సరే మెజారిటీ విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైసిపి నాయకులు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అరాచకాలు చేశారని టిడిపి నేతలు ఆరపిస్తున్నారు. నాటి అరాచకాలు ఇప్పుడు అక్కడి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చాయని.. అందువల్లే వైసీపీ నేతలు అందులోనూ జగన్ బాబాయ్.. పిన్ని ప్రచారం చేయడానికి ఇబ్బంది పడుతున్నారని.. బౌన్సర్లను సహాయంగా పెట్టుకున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. బౌన్సర్లను సహాయంగా పెట్టుకొని ప్రచారం చేస్తున్నారంటే అది వైసిపి దుస్థితికి అద్దం పడుతుందని.. ఎన్నికలకు ముందే ఓటమిని వారు అంగీకరించినట్టు అయిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

మొత్తం గా చూస్తే పులివెందుల పురపాలక రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సొంత గడ్డమీద బౌన్సర్లతో ప్రచారం నిర్వహించవలసిన దుస్థితి వైఎస్ కుటుంబానికి వచ్చింది. ఈ పరిణామం రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మరింత దిమ్మతిరిగే షాక్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper