Homeఆంధ్రప్రదేశ్‌President Draupadi Murmu: నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!

President Draupadi Murmu: నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!

President Draupadi Murmu: విశాఖలో( Visakhapatnam) అతిపెద్ద వేడుకకు రంగం సిద్ధం అయ్యింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, సిటీ పరేడ్ కు సర్వం సిద్ధమైంది. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈరోజు సాయంత్రం 4:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రానున్నారు ద్రౌపది ముర్ము. మంగళవారం రాత్రి విశాఖలోని బస చేయనున్నారు. బుధవారం ఉదయం జరిగే ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు.

* వేడుకలకు ఏర్పాట్లు..
సాగర తీరంలో వేడుకలకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు ( CM Chandrababu) బుధవారం విశాఖపట్నం కు వస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. 18న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, 19న సిటీ పరేడ్ జరగనుంది. ఇప్పటికే నగరానికి వీఐపీల తాకిడి పెరిగింది. కాగా ఈరోజు విశాఖకు వచ్చే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అయితే వేడుకలకు సంబంధించి సన్నాహాల్లో భాగంగా.. సోమవారం నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యుద్ధ ట్యాంకర్లు, మిగ్ 29, హాక్ ఫైటర్ జెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు ఏకంగా 65 దేశాలు పాల్గొంటున్నాయి. మన దేశ యుద్ధ నౌకలు, నావి సామర్థ్యం చాటిచెప్పనున్నారు.

* 15 నుంచి సందడి ప్రారంభం..
వాస్తవానికి విశాఖ నగరంలో ఈ నెల 15 నుంచి సందడి ప్రారంభం అయింది. మిలాన్( Milan) మొదలయింది. కొన్ని రకాల ప్రదర్శనలు కూడా చేశారు. 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్దనౌకలను సమీక్షిస్తారు. 19న మిలాన్ కార్యక్రమం తో పాటుగా మేరీ టైం సదస్సు కూడా నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం సైతం రామకృష్ణ బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కూడా ఉండనుంది. మరోవైపు ఈనెల 20న ఇండియన్ ఓషన్ నావెల్ సింపోజియం జరుపుతారు. 21 నుంచి 25 వరకు మిలాన్ సముద్ర విన్యాసాలు ఉంటాయి. ఇవి సందర్శకులకు ఆకట్టుకునేలా ఉండనున్నాయి. మొత్తానికి అయితే విశాఖ నగరంలో నావికోత్సవం పతాక స్థాయిలో ఉండనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular