Homeఆంధ్రప్రదేశ్‌Political Players: పొలిటికల్ ప్లేయర్స్ అదుర్స్.. ఆటంటే వారిది!

Political Players: పొలిటికల్ ప్లేయర్స్ అదుర్స్.. ఆటంటే వారిది!

Political Players: పొలిటికల్ గేమ్( political game) ఆడటం లో వారు వీరులు. కానీ క్రీడల్లో కూడా నేటి అనిపించుకున్నారు ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గత నాలుగు రోజులుగా విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్నేహపూర్వక క్రీడా పోటీలు జరుగుతున్నాయి. క్రికెట్, కబడ్డీ, జావలిన్ త్రో, షాట్ పుట్.. ఇలా ఆట ఏదైనా ఒకరిని మించి ఒకరు ఆడి క్రీడా స్ఫూర్తిని చాటారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వక క్రీడా పోటీలు ఉత్సాహ భరిత […]

Political Players: పొలిటికల్ గేమ్( political game) ఆడటం లో వారు వీరులు. కానీ క్రీడల్లో కూడా నేటి అనిపించుకున్నారు ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గత నాలుగు రోజులుగా విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్నేహపూర్వక క్రీడా పోటీలు జరుగుతున్నాయి. క్రికెట్, కబడ్డీ, జావలిన్ త్రో, షాట్ పుట్.. ఇలా ఆట ఏదైనా ఒకరిని మించి ఒకరు ఆడి క్రీడా స్ఫూర్తిని చాటారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వక క్రీడా పోటీలు ఉత్సాహ భరిత వాతావరణంలో సాగాయి. ఒకరికి మించి ఒకరు అన్నట్టు దుమ్ము లేపారు. తాము తలచుకుంటే రాజకీయాలే కాదు క్రీడా పోటీల్లో సైతం నెగ్గగలమని నిరూపించుకున్నారు. అయితే సాధారణ క్రీడాకారుల మాదిరిగా గాయాలుపాలు కావడం కూడా విశేషం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కబడ్డీ ఆడుతూ గాయాల పాలయ్యారు.

* గత కొద్దిరోజులుగా క్రీడా పోటీలు..
గత నాలుగు రోజులుగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాల్ రావు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జావలిన్ త్రోలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు వంటి సీనియర్లు సత్తా చాటారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. షాట్ పుట్ లో దూరం విసిరి తమ నైపుణ్యాన్ని కనబరిచారు. మ్యూజికల్ చైర్ పోటీల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి విన్నర్ గా నిలిచారు. బ్యాడ్మింటన్ 50 ఏళ్లు దాటిన కేటగిరిలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పరిటాల సునీతపై గెలుపొందారు. మహిళల డబుల్స్ లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ జోడి విజయం సాధించింది.

* పురుషుల కబడ్డీ ఫైనల్స్ లో విజయ్ కుమార్ జట్టుపై మంత్రి సత్య కుమార్ టీం విజయం సాధించింది.

* క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఏడుగురు మంత్రులు క్రికెట్ ఆడారు. వాసంశెట్టి సుభాష్ అన్ని విభాగాల్లో రాణించారు. సత్య కుమార్ యాదవ్ తో పాటు కొల్లు రవీంద్ర బౌలింగ్లో అదరగొట్టారు. నాదేండ్ల మనోహర్ కీపింగ్ రాకింగ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. క్రికెట్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన నాదెండ్ల మనోహర్ జట్టు 12 ఓవర్లలో 108 పరుగులు సాధించింది. అచ్చన్న టీం కష్టపడినా ఫలితం లేకపోయింది. నాదెండ్ల మనోహర్ జట్టు ఆరు పొడుగుల తేడాతో విజయం పొందింది.

* ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కు ముందు మీడియా సభ్యులతోనూ మంత్రులు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. మ్యాచ్ కు ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper