Homeఆంధ్రప్రదేశ్‌Pithapuram Varma: అనుమానం పెంచేలా చేసుకుంటున్న పిఠాపురం వర్మ

Pithapuram Varma: అనుమానం పెంచేలా చేసుకుంటున్న పిఠాపురం వర్మ

Pithapuram Varma: పిఠాపురం వర్మ( Pithapuram Varma) పరిస్థితి ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఆయన కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో ఆయన పెద్ద గలాటా చేశారు. సీఎం చంద్రబాబు చిన్న ఫోటోను ఫ్లెక్సీలో వాడారు అని మండిపడ్డారు. పెద్ద ఫోటో పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ […]

Pithapuram Varma: పిఠాపురం వర్మ( Pithapuram Varma) పరిస్థితి ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఆయన కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో ఆయన పెద్ద గలాటా చేశారు. సీఎం చంద్రబాబు చిన్న ఫోటోను ఫ్లెక్సీలో వాడారు అని మండిపడ్డారు. పెద్ద ఫోటో పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇదో రాష్ట్రస్థాయి వార్తగా మారిపోయింది. అయితే ఇప్పుడు వర్మ వ్యవహార శైలి పైనే బలమైన చర్చ నడుస్తోంది. కూటమి ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జనసేన నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు వర్మ తీరుతో. ఆయన అసహనంతోనే.. అసంతృప్తితోనే ఇలా చేస్తున్నారని.. ఆయనను నియంత్రించకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

* ఆ గౌరవం కాపాడకపోతే ఎలా..
పిఠాపురంలో వర్మ బలమైన నాయకుడే. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వారే. కానీ ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా సమర్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఎనలేని గౌరవం ఇస్తున్నారు. కానీ వర్మ మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఆ స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదు. తనకు దక్కాల్సిన ఎమ్మెల్యే పదవి పవన్ కళ్యాణ్ తీసుకున్నారన్న బాధ ఆయనలో వ్యక్తం అవుతోంది. తనకు వ్యక్తిగత డ్యామేజ్ జరిగిందన్న బాధ ఆయనలో కనిపిస్తోంది. కానీ కూటమిలో ఉన్నామని.. పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన భాగస్వామ్య పక్షంగా ఉన్నారన్న విషయాన్ని వర్మ గుర్తించుకుంటే మంచిది.

* ముద్రగడ కుమార్తె ఫైర్..
ఏదైనా అభివృద్ధితో పాటు ఇతరత్రా సమస్యలు ఉంటే వర్ణ మాట్లాడాలి. కానీ అదే పనిగా ప్రోటోకాల్, ఫోటోల గురించి ప్రస్తావించి లేనిపోని వివాదాలను తెస్తున్నారు. వైసీపీ లైన్లో పని చేస్తున్నారన్న అనుమానాలు పెంచేలా చేస్తున్నారు. అయితే వర్మపై ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి స్పందించారు. ఆయన తీరు చూస్తుంటే కూటమిలో విభేదాలు సృష్టించేందుకేనని అర్థమవుతోంది అని చెప్పుకొచ్చారు. తద్వారా ఆయన వైసీపీ లైన్ లో పనిచేస్తున్నారు అని అర్థం వచ్చేలా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికైనా పిఠాపురం వర్మ విషయంలో కట్టడి చర్యలు చేపట్టకపోతే ఇబ్బందికరమే..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper