Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy Ramachandra Reddy: అప్పట్లో.. పెద్దిరెడ్డి ఇలాకాలో ఎన్నికలు ఇలా జరిగేవి..

Peddireddy Ramachandra Reddy: అప్పట్లో.. పెద్దిరెడ్డి ఇలాకాలో ఎన్నికలు ఇలా జరిగేవి..

Peddireddy Ramachandra Reddy: పుంగనూరు ఎమ్మెల్యే.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.. ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలో ఎన్నికలను బహిష్కరించారు. పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలతో పని ఉండేది కాదు. బ్యాలెట్ పెట్టల అవసరం ఉండేది కాదు. భద్రతపరంగా ఖర్చు కూడా ఉండేది కాదు. జనం ఓటేయకముందే ఫలితం నిర్ణయం అయిపోయింది. […]

Peddireddy Ramachandra Reddy: పుంగనూరు ఎమ్మెల్యే.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.. ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలో ఎన్నికలను బహిష్కరించారు. పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలతో పని ఉండేది కాదు. బ్యాలెట్ పెట్టల అవసరం ఉండేది కాదు. భద్రతపరంగా ఖర్చు కూడా ఉండేది కాదు. జనం ఓటేయకముందే ఫలితం నిర్ణయం అయిపోయింది. అప్పటి అధికార వైసీపీ ఖాతాలో విజయాలు ఒక్కొక్కటిగా వచ్చి పడ్డాయి.

ఎంపిటిసిలు.. జెడ్పిటిసిలు.. మున్సిపాలిటీలు.. అన్ని వైసిపి వాళ్లదే. ఒక రకంగా చెప్పాలంటే అంతా ఏకపక్షమే. ఇలా కూడా ఎన్నికలు జరుగుతాయా అని జనం విస్తీ పోయేంత విడ్డూరమైన ఫలితాలు వచ్చాయి. నామినేషన్ ఘట్టంలోనే సమస్తము ముగిసిపోయే వింత వ్యూహం నాడు అక్కడ అమలైంది అధికార వ్యవస్థ దాసోహమైంది. పోలీసు వ్యవస్థ సహకారం అందించింది. మద్యం లేకుండా.. రూపాయి పంచకుండా ఎన్నికలు నిర్వహిస్తారు అంటే.. అందరూ ఇలాగా అనుకున్నారు. ముక్కున వేలేసుకున్నారు.

నాడు అధికార బలంతో బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. తంబళ్లపల్లె ప్రాంతంలో మొత్తం 72 ఎంపీటీసీలు వైసీపీకి చెందాయి. పుంగనూరు ప్రాంతంలో 69 కి 65 వాళ్లే దక్కించుకున్నారు. శ్రీకాళహస్తిలో 64 63 వైసీపీ ఖాతాలోపడ్డాయి. చంద్రగిరి ప్రాంతంలో 90 కి 85.. పీలేరు ప్రాంతంలో 63 కు 40.. తంబళ్లపల్లె.. పుంగనూరు.. శ్రీకాళహస్తి.. పీలేరు ప్రాంతాలలో జెడ్పిటిసిలు అధికార పార్టీకి దక్కాయి. చంద్రగిరిలో ఆరింటిలో ఐదు జెడ్పిటిసిలు వైసిపికి సొంతమయ్యాయి. పుంగనూరులో 31 వార్డులలో 22 నాటి అధికార పార్టీకి సొంతమయ్యాయి. తిరుపతిలో 11చోట్ల అసలు నాటి టిడిపి పోటీ కూడా చేయలేదు. బెదిరింపులు దర్జాగా సాగిపోయాయి. దౌర్జన్యాలు సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ప్రలోభాలు ఇష్టానుసారంగా సాగిపోయాయి. ఇలాంటి దారుణాలకు తెగ బడిన వ్యక్తులు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అని టిడిపి నేతలు అంటున్నారు.

ఇప్పటికైనా వైసీపీ నాయకులు పోటీ చేస్తే ప్రజల తీర్పు ఏంటో తెలుస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. ఒకసారి పెద్దిరెడ్డి గతం గుర్తుకు తెచ్చుకోవాలని.. అప్పుడే వాళ్ళు చేసిన తప్పులు అర్థమవుతాయని టిడిపి నేతలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యమంటే ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని.. అన్ని పార్టీలకు పోటీచేసే అవకాశం ఉండాలని.. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చివరికి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని టిడిపి నేతలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉండేది కాదని.. ప్రజలకు.. అన్ని పార్టీలకు అనుకూలంగా ఉండేదని.. ఇప్పటికైనా పెద్దిరెడ్డికి జ్ఞానోదయం అయితే అదే పదివేలు అని టిడిపి నేతలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper