Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ చర్యలతో జగన్, కేటీఆర్ ల పై చర్చ

Nara Lokesh: లోకేష్ చర్యలతో జగన్, కేటీఆర్ ల పై చర్చ

Nara Lokesh: కేటీఆర్, జగన్ తో లోకేష్ ఒక లెక్క అన్నట్టు తేలిగ్గా తీసుకునేవారు అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ ఇద్దరికీ మించి అన్నట్టు లోకేష్ వ్యవహార శైలి ఉంది. అయితే ఈ ముగ్గురు యువ నేతలు రాజకీయ వారసులే. ఎవరి స్టైల్ వారిది. ఒకరు తండ్రి రాజకీయ చరిష్మను వాడుకుని ఆయన ఆకస్మిక మృతితో వచ్చిన సెంటిమెంట్ తో సీఎం అయ్యారు. మరొకరు తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంట్రీ ఇచ్చారు. ఇంకొకరు అయితే తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి.. కానీ అధికారంలో లేకపోయినప్పుడు తండ్రి వెంట నిలబడ్డారు. అయితే ఆ ముగ్గురు రాజకీయ ప్రభావం చూపిన వారే తెలుగు రాష్ట్రాల్లో. కానీ ముగ్గురిలో ఇప్పుడు ఒకరి హవా మాత్రమే నడుస్తుండడం విశేషం.

Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా..

* జగన్ ఇలా..
వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు జగన్. తన తండ్రి రాజకీయ చరిష్మను వైసీపీ పెట్టుబడిగా మార్చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీకి ముఖ్యమంత్రి అయిపోయారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తండ్రికి మించి తనయుడు అనిపించుకోవాలని చూశారు. కానీ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని ఆశించి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పార్టీని పట్టుకొని.. కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారు జగన్.

* కేటీఆర్ అలా..
కెసిఆర్ కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ గత పదేళ్ల కాలంలో ఐటీ మంత్రిగా సేవలందించారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు మోస్తున్నారు. కెసిఆర్ అజ్ఞాతంలో పార్టీ బరువు బాధ్యతలను పూర్తిగా తన వైపు వేసుకున్నారు కేటీఆర్. అయితే ఆయన పార్టీలో సీనియర్ నాయకులకు గౌరవం ఇవ్వడం లేదని.. తన వర్గం నేతలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

* లోకేష్ అలా..
చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు లోకేష్. 2014లో టిడిపి ప్రభుత్వంలో పంచాయితీరాజ్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి రావడంతో పాఠశాల విద్యాశాఖను నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు తమ పార్టీలో సీనియర్ నేతల విషయంలో ఎలా వ్యవహరిస్తారు. మిగతా ఇద్దరు యువనేతలకు లోకేష్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే జగన్ తో పాటు కేటీఆర్ సొంత చెల్లెల్లనే పక్కన పెట్టేసారు.. తమ పార్టీ సోషల్ మీడియా సాయంతో వ్యక్తిగత దాడికి తెగబడుతున్నారు. కానీ లోకేష్ మాత్రం కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ను సొంత సోదరుడిగా చూసుకుంటున్నారు. మరోవైపు పార్టీలో సీనియర్లను గౌరవిస్తూ.. జూనియర్లను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు తనయుడిగా, ఒక రాష్ట్ర మంత్రిగా లోకేష్ ఇటీవల కర్ణాటక వెళ్ళినప్పుడు ప్రత్యేక కుర్చీ వేశారు. కానీ దానిని తిరస్కరించారు.. తన పక్కన ఉన్న సీనియర్ నేతలను గౌరవించి వారిని ఆ కుర్చీలో కూర్చోమని కోరారు. వారి పక్కనే మరో కుర్చీ ఏర్పాటు చేసుకుని కూర్చున్నారు. అయితే పరాయి గడ్డపై కూడా ఇప్పుడు జగన్, కేటీఆర్, లోకేష్ ల పై చర్చ నడిచింది. ఆ ఇద్దరి యువనేతలకు భిన్నంగా లోకేష్ ఇప్పుడు హైలెట్ అవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper