Nadendla Bhaskara Rao Passes Away: ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదేండ్ల భాస్కరరావు ఈరోజు మృతి చెందారు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో మంత్రి. ఆయన అకాల మృతి పై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 1980, 90 దశకాల్లో నాదెండ్ల భాస్కరరావు ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన అకాల మృతి పై సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. భాస్కర్ రావు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం పంజాగుట్టలోని వైకుంఠధామం లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సీనియర్ మోస్ట్ లీడర్..
నాదెండ్ల భస్కరరావు ఉమ్మడి రాష్ట్రంలోని సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన అదే పార్టీ ప్రయోగంతో నందమూరి తారక రామారావు పై తిరుగుబాటు చేశారు. ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. కానీ దానిని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారు. అయితే ఆ చిన్నపాటి విమర్శ ఆయన పొలిటికల్ లైఫ్ లో తీరని లోటు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు. ఆయన వృత్తిరీత్యా లాయర్. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు చంద్రబాబు సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టారు. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన నాదెండ్ల మనోహర్ మరి చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.
టిడిపి ఏర్పాటులో కీలక పాత్ర
తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో నాదెండ్ల భాస్కర రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. నందమూరి తారక రామారావు పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన తొలి తరం నేత ఆయన. 1982లో ఎన్టీ రామారావు వెంట నడిచారు నాదెండ్ల భాస్కరరావు. అప్పట్లో ఎన్టీఆర్కు కుడి భుజంగా వ్యవహరించేవారు. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన క్యాబినెట్లో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా నాదెండ్ల భాస్కరరావు వ్యవహరించారు.. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేశారు నాదేండ్ల భాస్కర్ రావు. 1984 ఆగస్టు 16న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అక్కడకు నెలరోజుల తర్వాత అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు నాదెండ్ల భాస్కరరావు. ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకున్నారు. అప్పటినుంచి టిడిపికి ఆగస్టు అంటే సంక్షోభం వస్తుంది. అయితే 1985లో ఎన్టీఆర్ తిరిగి ప్రజా తీర్పు అడిగారు. ఆ ఆ ఎన్నికల్లో టిడిపి మళ్లీ విజయం సాధించింది. అయితే అప్పటివరకు నాదెండ్ల భాస్కరరావు పేరు పెద్దగా ప్రాచుర్యంలో లేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతోపాటు ఆ పార్టీ సంక్షోభంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది.
తిరిగి మళ్లీ పోటీ..
1989లో తిరిగి నాదెండ్ల భాస్కరరావు తెనాలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతటితో నాదేండ్ల భాస్కరరావు రాజకీయ ప్రాతినిధ్యం ఆగలేదు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఏకంగా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అటు తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు భాస్కరరావు. ఆయన రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన నాదెండ్ల మనోహర్ 2004లో అదే తెనాలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. అయితే అనూహ్యంగా నాదేండ్ల మనోహర్ జనసేన లో చేరారు. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన తండ్రి భాస్కరరావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన కన్నుమూశారు. ప్రముఖుల సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.