Homeఆంధ్రప్రదేశ్‌Petrol bunk new timings: పెట్రోల్ బంక్ ల పై కీలక అప్డేట్.. ఇకపై ఉదయం...

Petrol bunk new timings: పెట్రోల్ బంక్ ల పై కీలక అప్డేట్.. ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 10 గంటలకే.. ఎందుకీ నిర్ణయమంటే..

Petrol bunk new timings: కోవిడ్ సోకినప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఆర్థికంగా ఇబ్బంది లేదు. కొంతమేర సడలింపులు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా లేదు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో చోటుచేసుకుంటున్న యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అమెరికా పూటకో మాట చెబుతోంది. ఇరాన్ రకరకాల ప్రకటనలు చేస్తోంది. ఇలా చూస్తుంటే ప్రపంచం […]

Petrol bunk new timings: కోవిడ్ సోకినప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఆర్థికంగా ఇబ్బంది లేదు. కొంతమేర సడలింపులు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా లేదు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో చోటుచేసుకుంటున్న యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అమెరికా పూటకో మాట చెబుతోంది. ఇరాన్ రకరకాల ప్రకటనలు చేస్తోంది. ఇలా చూస్తుంటే ప్రపంచం ఏమైపోతుందో.. ఇకముందు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

పశ్చిమాసియా ప్రాంతంలో క్రూడ్ ఆయిల్ అధికంగా ఉంటుంది. భారత్ లాంటి అతిపెద్ద జనాభా ఉన్న దేశాలకు అక్కడి నుంచే క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బంది ఎదురైతే మన దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కాబట్టి… క్రూడ్ ఆయిల్ సరఫరాలో తీవ్రమైన అంతరాయం చోటు చేసుకుంటున్నది. దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోతుంది. డాలర్ విలువ విపరీతంగా పెరుగుతోంది. రూపాయి విలువ తగ్గిపోతుంది. ఈ నేపద్యంలోనే మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి పడకముందే ప్రభుత్వం మేల్కొంది. పొదుపు చర్యలు మొదలుపెట్టింది. దుబారాకు చరమగీతం పాడేందుకు సిద్ధమైంది.

ఇప్పటికీ ప్రధానమంత్రి తన వాహనాల శ్రేణిలో చాలా వరకు తగ్గించుకున్నారు. అని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే పెట్రోల్ బంకులు నిర్వహించాలని.. దీనికి అనుమతులు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖను రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం.. వర్చువల్ మీటింగ్. లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దిశగా ఆలోచన చేయాలని. దీనివల్ల రిటైల్ అవుట్లెట్ లో విద్యుత్ ఆదా అవుతుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో అత్యవసరంగా వెళ్లే వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తారని.. దానికోసం పూర్తిస్థాయిలో ఇందనం అందుబాటులో ఉంటుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యయ నియంత్రణకు శ్రీకారం చుట్టారు. తన శ్రేణిలో వాహనాలను తగ్గించుకున్నారు. మిగతా మంత్రులు కూడా అదే బాటలో ఉన్నారు. అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలను తన వాహన శ్రేణిలో ఉంచాలని చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper