Homeఆంధ్రప్రదేశ్‌Kadapa MLA Madhavi stage outburst: మళ్లీ స్టేజీపై రెచ్చిపోయిన కడప ఎమ్మెల్యే మాధవి.. ఏంటీ...

Kadapa MLA Madhavi stage outburst: మళ్లీ స్టేజీపై రెచ్చిపోయిన కడప ఎమ్మెల్యే మాధవి.. ఏంటీ రగడ…వీడియో వైరల్

Kadapa MLA Madhavi stage outburst: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. భారీగా వచ్చిన ప్రజల సమక్షంలో లబ్ధిదారులకు ప్రభుత్వం గృహాలను మంజూరు చేసింది. ఇన్నాళ్లపాటు గృహ యోగానికి దూరంగా ఉన్న పేదలకు ప్రభుత్వం.. ఇళ్లను మంజూరు చేసింది. గృహాల పంపిణీ నేపథ్యంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వ్యవహరించిన తీరు సంచలనంగా […]

Kadapa MLA Madhavi stage outburst: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. భారీగా వచ్చిన ప్రజల సమక్షంలో లబ్ధిదారులకు ప్రభుత్వం గృహాలను మంజూరు చేసింది. ఇన్నాళ్లపాటు గృహ యోగానికి దూరంగా ఉన్న పేదలకు ప్రభుత్వం.. ఇళ్లను మంజూరు చేసింది.

గృహాల పంపిణీ నేపథ్యంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. గృహాల పంపిణీ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇన్చార్జి మంత్రి సవిత తర్వాత జెసి.. అనంతరం ఎమ్మెల్యేను స్టేజి పైకి పిలిచారు. అయితే మంత్రి తర్వాత తనను స్టేజి మీదకి పిలవాలని మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారులపై మండిపడ్డారు. అంతేకాదు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. మాధవరెడ్డి వ్యవహార శైలి తీరుతో జెసి అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

Also Read: పవన్ కళ్యాణ్ సార్.. మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూర్చండి.. వీడియో వైరల్

వాస్తవానికి జెసి అతిథి సింగ్ తప్పు ఏమీ లేకపోయినప్పటికీ మాధవి రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆ కార్యక్రమానికి హాజరైన వారు చెబుతున్నారు. ఇక ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవం లో జేసి అతిథి సింగ్ పై ఎమ్మెల్యే మాధవి రెడ్డి చిందులు దొక్కారు. గుడ్లు ఉరిమి చూశారు. అంతేకాదు వేదిక మీదికి తనను ఆహ్వానించకపోవడం పట్ల ఆమె మండిపడ్డారు. వేదికపై తనకు ప్రత్యేకంగా కూర్చి కూడా వేయలేదని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అరగంటకు పైగా మాధవి నిల్చున్నారు. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు.

నాటి ఘటన నుంచి అతిథి సింగ్, మాధవి రెడ్డి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయని కడప జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతుందని తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని.. తాజాగా గృహాల పంపిణీ విషయంలో కూడా ఇది బయటపడిందని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కూటమి అనుకూల మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కానీ వైసీపీ అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. మరి దీనిపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper