spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ సెక్రటేరియట్ సెట్.. సోషల్ మీడియాలో సెటైర్లు

Jagan: జగన్ సెక్రటేరియట్ సెట్.. సోషల్ మీడియాలో సెటైర్లు

Jagan: ఏపీలో ఓటమిపై జగన్ సమీక్షలు చేస్తున్నారు. వరుసగా నేతలతో సమావేశాలు పెడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో రివ్యూ జరిపారు. ఈ క్రమంలో కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు విడుదల చేశారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ సమీక్షలు చేశారో… ఇప్పుడు పార్టీ శ్రేణులతో అదే చోట సమావేశం అయ్యారు. అది సెక్రటేరియట్ గా కనిపిస్తోంది. దీంతో అసలు ఆయన సెక్రటేరియట్లో ఉండిపోయారా అన్న అనుమానం కలిగింది. అదే చర్చించుకోవడం ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటికి అసలు విషయం బయటపడింది.

తాడేపల్లి లోని తన నివాసంలో భారీ సెట్ అని తేలడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే జగన్ పాలించింది ఇన్నాళ్లు సెక్రటేరియట్ కాదని.. ఇంట్లోనే ఉంటూ సెక్రటేరియట్ సెట్ వేశారని సెటైర్లు ప్రారంభమయ్యాయి. సెక్రటేరియట్లో ఉన్నట్టుగా మభ్య పెట్టేలా… అక్కడి నుంచే పని చేస్తున్నట్లుగా ప్రజలు భ్రమించేలా ఓ కాన్ఫరెన్స్ హాల్ను జగన్ తనకోసం సెట్ వేయించుకున్నారు. తాడేపల్లి లో తనకున్న రెండు ఎకరాల ప్యాలెస్ లో క్యాంప్ ఆఫీస్ అంటూ.. ప్రజాధనంతో భవనం నిర్మించుకున్నారు. అందులోనే ఈ సెక్రటేరియట్ సెట్ వేయించుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్న ప్రతి ప్రాపర్టీ ప్రజాధనంతో వేయించుకున్నదే.

గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులతో.. టిడిపి హయాంలో స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఫర్నిచర్ ను తన సొంత అవసరాలకు వాడుకున్నారని వైసీపీ ఆరోపణలతోనే ఆయన మనస్థాపానికి గురయ్యారు. వైసిపి వెంటాడి వేటాడి ఆయన బలవన్మరణానికి పాల్పడేలా వ్యవహరించింది. ఆ విషయం తెలిసి కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు జగన్ ప్రభుత్వ ఫర్నిచర్ ను వాడుకుంటున్నారని టిడిపి నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. జగన్ గతంలో తిరుమల సెట్టింగ్ ను తన ఇంటి పక్కన వేయించుకున్నారు. ఉత్సవాలొస్తే చెవిరెడ్డి నేతృత్వంలో సెట్టింగ్లు వేయడం రివాజుగా మారింది. చివరకు సెక్రటేరియట్ సెట్టింగ్ ను కూడా విడిచిపెట్టలేదు. పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్న వేళ ఈ విషయం బయటపడటం విశేషం. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper