spot_img
Homeఆంధ్రప్రదేశ్‌పవన్, సంపూర్ణేష్ బాబు ఒక్కటి ఎలా అవుతారు ?

పవన్, సంపూర్ణేష్ బాబు ఒక్కటి ఎలా అవుతారు ?

రిపబ్లిక్‌ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంలో పవన్‌ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అయితే, ఏపీ ప్రభుత్వం పై పవన్ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ కి కౌంటర్ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం ఒకటే అంటూ.. పవన్ ను ఒక కమెడియన్ తో పోల్చి చెబుతూ పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేశాడు. అయినా పవన్, సంపూర్ణేష్ బాబు కష్టం, ఇక ఆ కష్టానికి ఫలితం ఒక్కటి ఎలా అవుతుంది అనిల్ ?

 How can Pawan and Sampoornesh Babu be one?

ఇక ఆన్‌ లైన్ టికెట్ల పోర్టల్ గురించి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ఈ విధానం పై ప్రభుత్వ పెద్దలతో చర్చించారని.. కాబట్టి ప్రభుత్వం పై విమర్శలు మానుకోవాలని అనిల్ చెప్పుకొచ్చాడు. మరి ఆ సినీ పెద్దలు ఎవరో అనిల్ ఎందుకు చెప్పడం లేదు ? అలాగే.. అనిల్ పవన్ విధానం పై స్పందిస్తూ.. ‘కేవలం మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ కి తన రాజకీయ ఉనికి కోసం జగన్‌ ని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.

ఇక నేను రోడ్డుపైకొస్తే మనిషిని కాదు, బెండు తీస్తాం’ అని పవన్ కల్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశాం. పవన్ కల్యాణ్ పార్టీ త్వరలోనే చాపచుట్టేయడం ఖాయం’ అంటూ అనిల్ కుమార్ కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశాడు. అయినా సినిమాల గురించి మాట్లాడినప్పుడు మధ్యలో రాజకీయ ప్రస్తావన ఎందుకు ? మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి మధ్యలో నాలుగు తిట్లు తిట్టి వెళ్ళిపోతే.. అది రాజకీయం ఎలా అవుతుందో అనిల్ కే తెలియాలి.

ఇక మరో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా పవన్‌ చేసిన వ్యాఖ్యల పై విమర్శలు చేశారు. బొత్స మాట్లాడుతూ.. ‘సినిమా టికెట్ల విషయంలో పవన్‌ కళ్యాణ్ కామెంట్స్ సరికాదు. అయినా.. సినిమా టికెట్ల రేట్లను మా ఇష్టానుసారం పెంచుకుంటాం.. ప్రభుత్వం చూస్తూ ఉండాలి అంటే.. కుదరదు. ప్రజలపై భారం వేస్తే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. జీఎస్టీ వంటి పన్నులను స్ట్రీమ్‌ లైన్‌ చేయడమే మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఇలా గొప్పగా సాగింది బొత్స స్పీచ్.

కానీ, ప్రజలకు మేలు చేస్తున్నాం అని చెబుతున్న బొత్స ఏ రకంగా మేలు చేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదు. ఇక చివరలో ‘నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడాడు’ అంటూ పవన్ పై విమర్శలు చేశాడు. ఏమిటో టికెట్ల సమస్య పై మాత్రం ఒక్కరూ మాట్లాడలేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Oktelugu Epaper