Homeఆంధ్రప్రదేశ్‌Google Data Center Visakhapatnam Inauguration: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఫిక్స్

Google Data Center Visakhapatnam Inauguration: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఫిక్స్

Google Data Center Visakhapatnam Inauguration: ఏపీలో( Andhra Pradesh) మరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఇది. దాదాపు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో దీనిని నెలకొల్పనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. భూముల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ తరుణంలో ఈ నెల 28న ఇందుకు సంబంధించిన శంకుస్థాపన జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ హాజరుకానున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరిగితే అనుబంధంగా చాలా రకాల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: అంతటి ఈడెన్ గార్డెన్స్ ను క్షణంలోనే కప్పేశారు.. గ్రౌండ్ మెన్ కృషికి హాట్సాఫ్

* మూడు చోట్ల భూములు..
విశాఖలో గూగుల్ డేటా సెంటర్( Google data centre) నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు చోట్ల 600కు పైగా ఎకరాల భూమిని కేటాయించింది. మరో రెండేళ్లలో అంటే 2028 జూలై నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఏపీఐఐసీ తర్లువాడ లో 38 ఎకరాలను సేకరించింది. అందులో ఇటీవల 266.6 ఎకరాలను గూగుల్ కు కేటాయించింది. ఇలా కేటాయించిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఆయా భూములను చేరుకునేందుకు అవసరమైన రహదారి నిర్మాణాన్ని రెండు ప్యాకేజీల్లో చేపడుతున్నారు.
* తర్లువాడలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కోసం అవసరమైన పర్యావరణ అనుమతికి ఇప్పటికే గూగుల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్ పేరుతో బిల్డింగ్ ప్లాన్ సమర్పించారు. మొత్తం 1.43 లక్షల చదరపు మీటర్లలో బిల్డప్ ఏరియాగా అందులో చూపించారు. ఇందులో పార్కింగ్ ప్లేస్ 33% కాగా.. గ్రీన్ బెల్ట్ కు 59.91 ఎకరాలు కేటాయించారు.
* మరోవైపు మొత్తం తర్లువాడలో 266 ఎకరాలు.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 174 ఎకరాలు… అడవివరంలో 166 ఎకరాలు కేటాయించారు.
* విశాఖలో ఈ భారీ ప్రాజెక్టుతో దేశమే కాదు ప్రపంచం సాగరనగరం వైపు చూసే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper