Dwakra Group: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. సంఘాలలో మహిళలకు మరింత అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభించనుంది. అందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఇది నిజంగా డ్వాక్రా మహిళలకు శుభవార్త. కొద్దిరోజుల కిందట ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పేరుతో రెండు పథకాలను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ పథకాలను ప్రారంభించబోతున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి ఈ పథకాలు వర్తించనున్నాయి. కొంతవరకు ఆర్థికంగా ఆసరాగా నిలవనున్నాయి.
* తక్కువ వడ్డీతో రుణాలు..
సాధారణంగా డ్వాక్రా మహిళలకు రుణాలు, రాయితీలు అందిస్తూ వస్తున్నారు. కానీ ఇకనుంచి వారి కుటుంబంలో పిల్లల వివాహాలకు, చదువులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు ఈ రెండు పథకాలు ప్రారంభించనున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం పదివేల నుంచి లక్ష రూపాయల వరకు క్రుణంగా ఇవ్వనుంది. దీనిని 48 వాయిదాలలో తిరిగి చెల్లించేందుకు వారికి అవకాశం కల్పిస్తారు. విద్యాలక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు సాయం అందిస్తారు. పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందిస్తారు. వీటిని సైతం నిర్ణీత కాలవ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
* వడ్డీ బాధ లేకుండా..
ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తూ వస్తున్నారు. సామాన్య పేద కుటుంబాల వారికి ఈ రుణాలు ఎంతగానో అండగా నిలుస్తూ వస్తున్నాయి. తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు, స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు దోహదపడుతూ వచ్చాయి. ప్రస్తుతం పేద కుటుంబాల్లో పెళ్లిళ్లు, చదువులకు ఇతరుల వద్ద రుణాలు చేస్తున్నారు. అధిక వడ్డీతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు సులభ వాయిదా పద్ధతుల్లో వివాహాలకు, పిల్లల చదువులకు ఈ రుణాలు అందిస్తారు పథకాల ద్వారా. నెలవారీగా సులభ వాయిదాలలో చెల్లింపులకు ఇది ఎంతగానో దోహదం చేయనుంది. ఇది నిజంగా సామాన్య పేద వర్గాల వారికి ఒక రకమైన ఉపయోగమే.