Homeఆంధ్రప్రదేశ్‌Google AI hub Visakhapatnam: తేలిపోతున్న అబద్ధపు ప్రచారాలు!

Google AI hub Visakhapatnam: తేలిపోతున్న అబద్ధపు ప్రచారాలు!

Google AI hub Visakhapatnam: అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. నిజం మాదిరిగా పవర్ ఫుల్ గా ఉండాలి. ఫూల్ అయ్యేలా ఉండకూడదు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. ప్రభుత్వ ఖర్చుతో కొలంబోలో క్రికెట్ చూసేందుకు లోకేష్ వెళ్లారు. అక్కడ తన ఫోటో, వార్తలు మీడియాలో రావడం కోసం జాతీయ మీడియాకు డబ్బులు ఇచ్చారు. బిల్ గేట్స్ పర్యటనలు టీలు, సమోసాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హెరిటేజ్ కంపెనీ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా […]

Google AI hub Visakhapatnam: అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. నిజం మాదిరిగా పవర్ ఫుల్ గా ఉండాలి. ఫూల్ అయ్యేలా ఉండకూడదు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. ప్రభుత్వ ఖర్చుతో కొలంబోలో క్రికెట్ చూసేందుకు లోకేష్ వెళ్లారు. అక్కడ తన ఫోటో, వార్తలు మీడియాలో రావడం కోసం జాతీయ మీడియాకు డబ్బులు ఇచ్చారు. బిల్ గేట్స్ పర్యటనలు టీలు, సమోసాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హెరిటేజ్ కంపెనీ టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది.. ఇలా ప్రతిరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం తో పాటు వారి అనుకూల మీడియా ప్రచారం చేస్తూనే ఉంది. నిజం నిలకడ అన్నట్టు ప్రభుత్వం ఆధారాలతో తప్పు అని చూపుతోంది. కానీ కిందపడినా తమదే పైచేయి అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదోరకం సంతృప్తి చెందుతోంది. అయితే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో కూడా అదే తరహా ప్రచారానికి దిగింది. అయితే ఈసారి ప్రభుత్వం కంటే.. అదే గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ చెక్ పెట్టారు.

వైసిపి నేతల దుష్ప్రచారం..
గూగుల్ డేటా సెంటర్తో( Google data centre) నిష్ప్రయోజనమని.. అసలు ఆ కంపెనీతో ఎలాంటి లాభం లేదు అని ఒకప్పటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇక వైసిపి అనుకూల మీడియా గురించి చెప్పనవసరం లేదు. ఇటువంటి తరుణంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీనికి చెక్ చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి విశాఖ తో పాటు భారత్లో పలు ముఖ్య నగరాలను కలుపుతూ సముద్రం అడుగున ఇంటర్నెట్ కేబుల్ వేయబోతున్నాం అని ప్రకటించారు. దీని ద్వారా ఏపీతోపాటు భారతదేశానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాటిని వివరించే ప్రయత్నం చేశారు.

సంతోషించాలి కానీ..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయి. అయితే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతున్న దృష్ట్యా సంతోషించాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దుష్ప్రచారం చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఏదైనా మంచి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అది మా క్రెడిట్ అంటారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లాంటి వారు వస్తే క్రిమినల్ అని ముద్ర వేస్తున్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రానివ్వకుండా చేయడమే వీరి ధ్యేయంగా కనిపిస్తోంది.. కచ్చితంగా ప్రజలు ఇటువంటి వాటిని గమనిస్తుంటారు. ఇలాగే ముందుకు సాగితే మాత్రం నిజం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper