Homeఆంధ్రప్రదేశ్‌Drinking Alcohol: ఇదేం తాగుడురా బాబు.. మీటరే పగిలిపోయేలా ఉంది!!

Drinking Alcohol: ఇదేం తాగుడురా బాబు.. మీటరే పగిలిపోయేలా ఉంది!!

Drinking Alcohol: సురాపానం.. మందుబాబులు, మద్యం ప్రియులు ముద్దుగా పిలుచుకునే పేరు. ఒక దశాబ్దకాలంగా మద్యం ప్రియులు విపరీతంగా పెరిగారు. తాగడమంటే… ఏదో ఒకటో రెండో పెగ్గులు కొట్టి ఊరుకోవడం లేదు. పీకలదాకా తాగుతున్నారు. నాలెడ్జ్‌ ఈజ్‌ డివైన్‌ అటే.. ‘అతడు సినిమాలో వైఎన్‌ ఎంత తాగితే అంత నాలెడ్జి వస్తుంది’ అని చెప్పినట్లు ఇటీవలి కాలంలో యువత ఎంత తాగితే అంత గొప్ప.. అన్నట్లుగా తాగుతున్నార. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ధరలు ఎంత పెరిగినా.. సంబంధం లేదు అన్నట్లు ఏ యేటికాయేడు గత రికార్డులను తిరగరాస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఓ యువకుడు తాగుడులోనూ సరికొత్త రికార్డు సృష్టించాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ మీటరే పగిలిపోయేలా మద్యం సేవించాడు. పైగా ఎలాంటి తడబాటు లేకుండా ద్విచక్రవాహనం నడుపుతూ రోడ్డెక్కి పోలీసులకు పట్టుపడ్డాడు.

Drinking Alcohol
Gudivada Man

రీడింగ్‌ చూసి పోలీసుల షాక్‌..

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి ఏం తాగాడో.. ఎన్ని తాగాడో తెలియదు గానీ మూడు రోజుల క్రితం ద్విచక్రవహనంపై వస్తుండగా.. యువకుడిని డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులు ఆపారు. అతడి నోట్లో పైపుట్టి ఊదమన్నారు. ఆ మందుబాబు ఊదిన ఊదుడుకు డ్రంకెన్‌డ్రైవ్‌ మీటరులో రీడింగ్‌ చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ నమోదుకాని విధంగా పాయింట్లు చూపించింది. షాక్‌నుంచి తేరుకున్న పోలీసులు ఏం తాగావురా బాబు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

530 నాట్‌ ఔట్‌..

Drinking Alcohol
Boom Beer

బ్రీత్‌ ఎనలైజర్‌లో రీడింగ్‌ పర్సంటేజ్‌ ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో అక్కడున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఒకటీ, రెండు బీర్లు తాగితే ఇంత పర్సంటేజ్‌ చూపించదని.. సుమారు 15కు పైగా బీర్లు తాగితేనే ఇంత పర్సంటేజ్‌ వస్తుందని చెప్పారు. వెంటనే ఆ ప్రబుద్ధుడి బైక్‌ సీజ్‌ చేసి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇంత ఆల్కమాల్‌ పర్సంటేజీ వచ్చినా సదరు యువకుడు తొణకకుండా బెనకకుండా బైక్‌ నడుపుతూ రోడ్డెకడం కూడా పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. 15 బీర్లు తాగాడంటే.. సుమారు 12 లీటర్ల లిక్విండ్‌ కడుపులో పోసినట్లు.. ఇంత ద్రవం అతడి కడుపులో ఎలాపట్టిందనేది కూడా ఆశ్చర్యపోయే అంశమే. సాధారణంగా రెండు లీటర్ల నీళ్లు తాగడానికే పొట్టంతా నిండుగా అనిపిస్తుంది. కానీ మందుబాబు మాత్రం 12 లీటర్ల ద్రవంతో సమానమైన 15 బీర్లు ఎలా తాగాడు.. అతడి కడుపులో ఎలా పట్టిందని మరికొంతమంది మందుబాబులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్న ఈ రికార్డుస్థాయి రీడింగ్‌ ఎవరో అని మందుబాబులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular