Chandrababu Salary : ఏపీకి నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. పొదుపు పాటిస్తారు అన్న మంచి పేరు ఆయనకు ఉంది. ఆర్భాటాల విషయంలో సైతం ఆచితూచి ఉంటారు. పనిలో ముందు ఉండే ఆయన వేతనంలో మాత్రం వెనుకబడ్డారు. అసలు చంద్రబాబు ఎంత జీతం తీసుకుంటారు? అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. అధికారుల మాదిరిగానే రాష్ట్ర ముఖ్యమంత్రికి జీతభత్యాలు ఉంటాయి. దేశంలో ఉత్తర ప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ ముఖ్యమంత్రిలు వేతనాల్లో ముందున్నారు.వారి తరువాత చంద్రబాబు నిలిచారు.
దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల జీతభత్యాలు ఒకేలా ఉండవు.ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఉంటాయి.వారి రాష్ట్ర పరిస్థితులు,ఆర్థిక స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది.ప్రతి ముఖ్యమంత్రికి వాహనంతో పాటు భద్రతా సౌకర్యం ఉంటుంది.వీరు దేశ విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సొంత విమానాలను, హెలిక్యాప్టర్లను కలిగి ఉంటాయి. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.ఈ విషయంలో సీఎంతో పాటు గవర్నర్ కూడా ప్రత్యేక హక్కులు ఉంటాయి.సమయం ఆదా చేయడానికి ఈ ప్రత్యేక విమానాలు,హెలికాప్టర్లను ఎక్కువగా వాడుతుంటారు.రాష్ట్రంలో పర్యటనకు హెలికాప్టర్,రాష్ట్రం బయట ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తుంటారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు వేతనాన్ని రూ.3,35000గా నిర్ణయించారు.అదనంగా ఉండే సౌకర్యాలు అన్నీ ఉంటాయి.ఇటీవల ఒడిస్సా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ చరణ్ మాంఝాకి 1.60 లక్షల వేతనంగా నిర్ణయించినట్లు ఒడిస్సా ప్రభుత్వం చెప్పింది. అతి తక్కువ వేతనం త్రిపురా ముఖ్యమంత్రి కి ఇస్తున్నారు. ఆయన జీతం అక్షరాల లక్ష 5000 రూపాయలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జీతం నాలుగు లక్షల పదివేలు. దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ సీఎం ఉంటారు ఈ విషయంలో…
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ఇలా ఉన్నాయి.తెలంగాణ సీఎంకు రూ.4,10,000, ఆంధ్రప్రదేశ్ సీఎంకు రూ.3,35,000, గుజరాత్ సీఎంకు రూ.3,21,000, హిమాచల్ ప్రదేశ్ సీఎంకు రూ.3,10,000, హర్యానా సీఎం కు రూ.2,88,000, జార్ఖండ్ సీఎంకు రూ.2,55,000, ఢిల్లీ సీఎంకు రూ.3,90,000, ఉత్తరప్రదేశ్ సీఎం కు రూ.3,65,000, మహారాష్ట్ర సీఎంకు రూ.3,40,000, పశ్చిమ బెంగాల్ సీఎంకు రూ.2,10,000, ఉత్తరాఖండ్ సీఎంకు రూ.1,75,000, రాజస్థాన్ సీఎంకు రూ.1,75,000, ఒడిస్సా సీఎం కు రూ.1,60,000, మేఘాలయ సీఎంకు రూ.1,50,000, అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు రూ.1,33,000, అస్సాం సీఎంకు రూ.1,25,000, తమిళనాడు సీఎంకు రూ.2,05,000, కర్ణాటక సీఎం కు రూ.2,00,000, సిక్కిం సీఎంకు రూ.1,90,000, కేరళ సీఎంకు రూ.1,85,000, మణిపూర్ సీఎం కు రూ.1,20,000, నాగాలాండ్ సీఎంకు రూ.1,10,000, త్రిపుర సీఎంకు రూ.1,05,500, మధ్యప్రదేశ్ సీఎం కు రూ.2,30,000, చత్తీస్గడ్ సీఎం కు రూ.2,30,000, పంజాబ్ సీఎంకు రూ.2,30,000, గోవా సీఎంకు రూ.2,20,000, బీహార్ సీఎంకు రూ.2,15,000 వేతనం అందుతుంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Does chandrababu know much about the salaries of chief ministers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com