Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Tamil Nadu campaign: తమిళనాడులో చివరి నిమిషంలో చంద్రబాబు.. కారణం అదే

Chandrababu Tamil Nadu campaign: తమిళనాడులో చివరి నిమిషంలో చంద్రబాబు.. కారణం అదే

Chandrababu Tamil Nadu campaign: ఏపీ సీఎం చంద్రబాబుపై( AP CM Chandrababu) భారతీయ జనతా పార్టీ ఒక కీలక బాధ్యతను పెట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం పై బిజెపి ఆగ్రహంగా ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల తీరుతోనే ఈ బిల్లు వీగిపోయిందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విపక్షాలను కట్టడి చేసే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించింది. చంద్రబాబు తన […]

Chandrababu Tamil Nadu campaign: ఏపీ సీఎం చంద్రబాబుపై( AP CM Chandrababu) భారతీయ జనతా పార్టీ ఒక కీలక బాధ్యతను పెట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం పై బిజెపి ఆగ్రహంగా ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల తీరుతోనే ఈ బిల్లు వీగిపోయిందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విపక్షాలను కట్టడి చేసే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించింది. చంద్రబాబు తన వ్యూహ చతురతతో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని బిజెపి పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి అకస్మాత్తుగా చంద్రబాబు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈరోజు నుంచి రెండు రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు చంద్రబాబు. ప్రధానంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అయితే కేవలం ఎన్నికల ప్రచారం మాత్రమే కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్తో పాటు విపక్షాలు వ్యవహరించిన తీరు ఎండగట్టేందుకే చంద్రబాబు తమిళనాడు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ స్థానంలో..
వాస్తవానికి చంద్రబాబు తమిళనాడు( Tamil Nadu ) ఎన్నికల ప్రచార షెడ్యూల్ అస్సలు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్ కూడా చేసుకున్నారు. అందుకే తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లేందుకు కుదరదు. అందుకే చంద్రబాబు పై ఇప్పుడు భారం పెట్టింది బిజెపి. పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదు విపక్షాల తీరుతో. ఆపై డీలిమిటేషన్ బిల్లు కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలకు దిగారు బిజెపి పెద్దలు. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో విపక్షాల తీరును తప్పుపట్టే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తే కాంగ్రెస్ తో పాటు విపక్షాలు అడ్డుకున్న తీరును చంద్రబాబు ఎండగట్టే అవకాశం ఉంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు అజెండా..
తమిళనాడు ఎన్నికల్లో కేవలం భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తుంది. అయితే అక్కడ భవిష్యత్తులో ఎదగాలన్నది బిజెపి ప్రణాళిక. ప్రస్తుతానికి అన్న డీఎంకే కూటమితో వెళ్తోంది కానీ.. కలిసి వస్తే ఒంటరి పోరాటానికి మాత్రమే మొగ్గు చూపే అవకాశం ఉంది భవిష్యత్తులో. అయితే అందుకు బలమైన పునాది అవసరం ఆ పార్టీకి. ప్రస్తుతం మహిళా బిల్లు వీగిపోయిన నేపథ్యంలో.. దానిని ఒక బలమైన అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. అయితే దాని ప్రాధాన్యతను కూడా చంద్రబాబు లాంటి సీనియర్ నేతతో చెప్పిస్తే ప్రజల్లోకి బలంగా వెళ్తుందని ఆశిస్తోంది. అందుకే ఈరోజు నుంచి రెండు రోజులపాటు చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉండనున్నారు. మొత్తానికి అయితే చంద్రబాబు చివరి నిమిషంలో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు. అక్కడ గెలుపు కంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని ఆయన లేవనెత్త నున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper