Amaravati Data Centers: ఏపీ మంత్రి నారా లోకేష్ లో( Nara Lokesh) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రోజురోజుకు పరిణితి పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేష్. తనలోనున్న లోపాలను అధిగమిస్తూ… ప్రత్యర్థులపై దూకుడు తనం ప్రదర్శిస్తూ.. పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ.. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ లోకేష్ వెళుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఈ స్థాయి విజయం అందుకున్నప్పుడు ప్రకటనలు శృతిమించుతుంటాయి. కానీ లోకేష్ మాత్రం ప్రకటనలే కాదు వ్యవహార శైలిలో సైతం చాలా నియంత్రణ గానే ఉంటారు. ఎక్కడా నోరు జారింది లేదు. ప్రస్తుతం టిడిపి శ్రేణులను ఆయన బాగానే మెప్పించారు. చాలా బాగా ఆకట్టుకుంటున్నారు. లోకేష్ ను చూసినవారు.. ఈయన లోకేష్ యేనా? అని ఆశ్చర్యపోయేలా చూస్తున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ లోకేష్ పాత్ర పెరిగింది. తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు పొందుతున్నారు నారా లోకేష్. కేవలం ఏపీలోనే కాదు జాతీయస్థాయిలో సైతం ఇదే చర్చ నడుస్తోంది.
Also Read: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?
ఢిల్లీ పర్యటనతో బిజీగా..
గత రెండు రోజులుగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో( Delhi) పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటన తండ్రి చంద్రబాబును తలపిస్తోందన్న టాక్ ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. సాధారణంగా చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెడితే క్షణం తీరిక లేకుండా గడుపుతారు. నిత్యం చర్చలకు పరిమితం అవుతారు. కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఇప్పుడు కూడా నారా లోకేష్ అదేవిధంగా గడుపుతున్నారు. మంత్రులతో పాటు కేంద్ర అధికారులను కలిసి.. అనేక ప్రాజెక్టులపై చర్చించి నిధులు రాబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ వర్గాలు సైతం లోకేష్ పని తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రెండు రోజుల కిందట లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అయితే బయట కార్యక్రమాలకంటే ఆయన మంత్రులను కలిసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఐటి అభివృద్ధి ధ్యేయంగా..
మరో రెండేళ్లలో ఐటీ( information technology) పరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఉన్నారు లోకేష్. ఇప్పటికే విశాఖకు భారీగా ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చారు. ముందుగా దావోస్ వెళ్లారు. ఇటీవల సింగపూర్ పర్యటనకు కూడా వెళ్లారు. కానీ కంపెనీల గురించి హడావిడి చేయడం లేదు. ఆ కంపెనీలు వచ్చిన తరువాత మాత్రమే వాటి గురించి ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీలో తన పని తాను చక్కబెడుతున్నారు. ముందుగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ను కలిశారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నామని.. కేంద్ర ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. డేటా సెంటర్ రాకతో విశాఖ స్వరూపమే మారిపోతుందని కేంద్రమంత్రి తో చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను కూడా కేంద్రమంత్రికి వివరించారు. మరోవైపు ఈరోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు లోకేష్. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం వంటి వాటికి నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమయ్యారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
Also Read: నారా లోకేష్ సపోర్టు ‘కూలీ’ కే..పరోక్షంగా ‘వార్ 2’ చూడొద్దు అంటున్నాడా?
ప్రతికూలతలను అధిగమిస్తూ..
ఒకానొక సమయంలో చంద్రబాబు( CM Chandrababu) వారసత్వాన్ని లోకేష్ అందుకోగలరా అన్న చర్చ సాగింది. రాజకీయంగా వ్యతిరేక ప్రచారం నడిచింది. సోషల్ మీడియాలో సైతం లోకేష్ సమర్థతను, రాజకీయ అర్హతను ప్రశ్నిస్తూ అనేక రకాలుగా ట్రోల్స్ నడిచాయి. కానీ వాటన్నింటినీ చెక్ చెబుతూ లోకేష్ రాజకీయంగా పరిణితి సాధించారు. చంద్రబాబు వారసత్వాన్ని అందుకున్నారు. తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఢిల్లీ వర్గాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.