Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana Legal Notice: బొత్సకు లీగల్ నోటీసులు!

Botsa Satyanarayana Legal Notice: బొత్సకు లీగల్ నోటీసులు!

Botsa Satyanarayana Legal Notice: సీనియర్ నేత బొత్స కు హెరిటేజ్ సంస్థ( Heritage company) నోటీసులు ఇచ్చింది. తమ సంస్థ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యానించడంతో బొత్స సత్యనారాయణ కు లీగల్ నోటీసులు జారీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెయ్యి కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ సంస్థను ఉద్దేశాపూర్వకంగా బయటకు తెచ్చిందని.. అందులో భాగంగా రాజకీయ ప్రేరేపితంలో భాగంగా బొత్స సత్యనారాయణ తో ఈ వ్యాఖ్యలు చేయించింది అని అభిప్రాయ పడింది హెరిటేజ్. అందుకే […]

Botsa Satyanarayana Legal Notice: సీనియర్ నేత బొత్స కు హెరిటేజ్ సంస్థ( Heritage company) నోటీసులు ఇచ్చింది. తమ సంస్థ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యానించడంతో బొత్స సత్యనారాయణ కు లీగల్ నోటీసులు జారీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెయ్యి కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ సంస్థను ఉద్దేశాపూర్వకంగా బయటకు తెచ్చిందని.. అందులో భాగంగా రాజకీయ ప్రేరేపితంలో భాగంగా బొత్స సత్యనారాయణ తో ఈ వ్యాఖ్యలు చేయించింది అని అభిప్రాయ పడింది హెరిటేజ్. అందుకే లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో ఇప్పటికే హెరిటేజ్ సంస్థ ప్రత్యేక ప్రకటన చేసింది. అయినా సరే వైసిపి అనుకూల మీడియాతో పాటు నేతలు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు గాను హెరిటేజ్ న్యాయ పోరాటానికి దిగింది.

* స్పష్టమైన ప్రకటన..
మహారాష్ట్రకు చెందిన ఇండాపూర్ డైరీ తో( Indapur diary ) హెరిటేజ్ కు ఎటువంటి సంబంధం లేదని యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేసింది. వారితో కొన్ని పదార్థాల తయారీ ఒప్పందమే కానీ.. యాజమాన్యపరమైన ఎటువంటి ఒప్పందాలు లేవని చెప్పింది హెరిటేజ్. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం కొన్ని కంపెనీలతో హెరిటేజ్ సిండికేట్ అయిందని ఆరోపించారు. హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్లను మీడియా ముందుకు చూపి కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. అందుకే ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఆయనకు లీగల్ నోటీసులను జారీ చేసింది. జగన్ ప్రేరేపితంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం చేసింది.

* డామేజ్ కంట్రోల్ కోసమే..
హెరిటేజ్ పాలపదార్థాలతో పాటు ఆహార ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. అందులో భాగంగా కొన్ని ఆహార పదార్థాలను ఇండాపూర్ డైరీ నుంచి పొందేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే టీటీడీ లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ జరిగింది. దానిని కప్పిపుచ్చేందుకే ఇప్పుడు హెరిటేజ్ పై నిరాదరణ ఆరోపణలు చేస్తున్నారని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా హెరిటేజ్ పై ఈ సరికొత్త ఆరోపణలను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇవ్వాలని హెరిటేజ్ భావించింది. అందుకే సీనియర్ నేత బొత్స కు లీగల్ నోటీసులు ఇచ్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper