Homeఅంతర్జాతీయంIran US Ceasefire Breakdown 48 Hours: సీజ్‌ఫైర్‌ బ్రేక్‌.. పాకిస్తాన్‌ పరువు పోయింది!

Iran US Ceasefire Breakdown 48 Hours: సీజ్‌ఫైర్‌ బ్రేక్‌.. పాకిస్తాన్‌ పరువు పోయింది!

Iran US Ceasefire Breakdown 48 Hours: పశ్చిమాసియా యుద్ధం ఆగింది. ఇరాన్‌–అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల సీజ్‌ఫైర్‌ (కాల్పుల విరమణ) ఒప్పందం కేవలం 48 గంటల్లోనే బ్రేక్‌ అయింది. సీజ్‌ఫైర్‌ కుదిరిన కొన్ని గంటలకే లెబనాన్‌లోని హెజ్బుల్లాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేయడం, దానికి ప్రతికారంగా ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని మూసివేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ఈ పరిణామాలతో ‘యుద్ధాన్ని రెండు వారాలు ఆపామని‘ చంకలు గుద్దుకున్న పాకిస్తాన్‌ పరువు పోయింది. […]

Iran US Ceasefire Breakdown 48 Hours: పశ్చిమాసియా యుద్ధం ఆగింది. ఇరాన్‌–అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల సీజ్‌ఫైర్‌ (కాల్పుల విరమణ) ఒప్పందం కేవలం 48 గంటల్లోనే బ్రేక్‌ అయింది. సీజ్‌ఫైర్‌ కుదిరిన కొన్ని గంటలకే లెబనాన్‌లోని హెజ్బుల్లాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేయడం, దానికి ప్రతికారంగా ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని మూసివేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ఈ పరిణామాలతో ‘యుద్ధాన్ని రెండు వారాలు ఆపామని‘ చంకలు గుద్దుకున్న పాకిస్తాన్‌ పరువు పోయింది.

ఏమీ సాధించని 40 రోజుల యుద్ధం…
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రారంభించిన యుద్ధం 40 రోజులు సాగింది. ఇరాన్‌లో రెజీమ్‌ ఛేంజ్, అణు కార్యక్రమాల నిర్మూలన, యురేనియం స్వాధీనం లక్ష్యంగా సాగిన ఈ యుద్ధంలో అమెరికా ఒక్క లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయింది. మరోవైపు ఈ యుద్ధంతో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూశాయి. చమురు, సరుకు రవాణా నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. హార్ముజ్‌ మూసివేతతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

పాకిస్తాన్‌ ద్విముఖ విధానం..
పాకిస్తాన్‌ అమెరికా సూచన మేరకు ఇరాన్‌ను సీజ్‌ఫైర్‌కు ఒప్పించింది. కానీ, ఇక్కడ పాకిస్తాన్‌ అనుసరించిన ద్విముఖ విధానమే సీజ్‌ఫైర్‌ బ్రేక్‌ అవడానికి ప్రధాన కారణమైంది. సీజ్‌ఫైర్‌లో లెబనాన్‌ కూడా ఉందని చెప్పిందని ఇరాన్‌కు చెప్పి ఒప్పించింది. అమెరికాకు మాత్రం లెబనాన్‌ లేదు, కేవలం ఇరాన్‌ మాత్రమే ఉందని చెప్పింది. ఈ విధంగా రెండు వైపులా భిన్నమైన సమాచారం ఇవ్వడంతో, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేయడం, దానికి ప్రతికారంగా ఇరాన్‌ హార్ముజ్‌ను మూసివేయడం జరిగింది. ఈ పరిణామాలతో పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంపై నమ్మకం సన్నగిల్లింది.

ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
సీజ్‌ఫైర్‌ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 200 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ దాడులను సమర్థించుకుంటూ, ‘రెండు వారాల కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదు, అది జలసంధిలో భాగం కాదు‘ అని స్పష్టం చేశారు. హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు.

ఇరాన్‌ ప్రతీకారం..
లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని మూసివేసింది. సీజ్‌ఫైర్‌తో ఇరాన్‌ హార్ముజ్‌ను తెరిచినప్పటికీ, ఇరాన్‌ పర్యవేక్షణలోనే నౌకలు వెళ్లాలని షరతు విధించింది. కానీ, లెబనాన్‌పై దాడులు కొనసాగడంతో మళ్లీ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతంవాటా కలిగిన ఈ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి.

హార్ముజ్‌పై టోల్‌ వసూలు..
మరోవైపు, హార్ముజ్‌ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్‌ వసూలు చేయాలని ఇరాన్‌ భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. ఎవరికి వాళ్లు పన్నులు విధిస్తే చమురు ధరలు భారీగా పెరుగుతాయని, దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇజ్జత్‌ తీసుకున్న పాకిస్తాన్‌..
రెండు వారాల పాటు యుద్ధాన్ని ఆపామని, శాంతి చర్చలకు వేదికయ్యామని పాకిస్తాన్‌ చంకలు గుద్దుకుంది. కానీ, కేవలం 48 గంటల్లోనే సీజ్‌ఫైర్‌ బ్రేక్‌ అవ్వడం, హార్ముజ్‌ మూసివేతతో ప్రపంచ సంక్షోభం తలెత్తడంతో పాకిస్తాన్‌ పరువు పోయింది. పాకిస్తాన్‌ ద్విముఖ విధానం, అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య నమ్మకరాహిత్యం ఈ విఫలతకు ప్రధాన కారణాలు.

హార్ముజ్‌ మూసివేతతో ప్రపంచ చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. ఇరాన్‌ యుద్ధంలో అమెరికాను ఆర్థికంగా దెబ్బకొడుతోంది. అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలపై దాడులు చేస్తోంది. హార్ముజ్‌ మూసివేతతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిలో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే, ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడులు ఆపాలి, ఇరాన్‌ హార్ముజ్‌ను తెరవాలి. అమెరికా నిజాయితీగా శాంతి చర్చలు జరపాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper