Borugadda Anil
Borugadda Anil : ఆంధ్రజ్యోతి ప్రచురించిన మాయమైపోయాడు కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఈ కథనం పట్ల ఏపీ అధికార వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వాస్తవానికి బోరుగడ్డ అనిల్ తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే అతడి బెయిల్ విజ్ఞప్తిని న్యాయస్థానం మానవీయ కోణంలో పరిశీలించింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు బోరు గడ్డ అనిల్ కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడానికి ముందే అనిల్ తల్లిని ఫిబ్రవరి 12న ఆసుపత్రిలో చేర్పించారు. 18న ఆమెకు సర్జరీ జరిగింది. 23న డిశ్చార్జి అయ్యారు. అయితే 28న బోరుగడ్డ అనిల్ బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది. ఇక హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఫిబ్రవరి 28న అనిల్ రాజమండ్రి జైల్లో లొంగిపోయారు. మార్చి 1న తనకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని అనిల్ హైకోర్టును ఆశ్రయించారు.. అయితే అక్కడ కోర్టును తప్పు దోవ పట్టించే విధంగా తన తల్లి ఇంకా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పరిస్థితి క్షీణిస్తోందని.. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని గుంటూరు లలిత హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ ఇచ్చినట్టుగా ఒక నకిలీ మెడికల్ సర్టిఫికెట్ ను అనిల్ కోర్టు ఎదుట సబ్మిట్ చేశాడు.. దీంతో కోర్టు ఈనెల 11 వరకు అనిల్ కు మధ్యంతర బెయిల్ పొడిగించింది. ఒకవేళ ఆ సర్టిఫికెట్ నకిలీది అని తేలితే చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే సర్టిఫికెట్ నకిలీది అని తేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. గుంటూరులో అతడి ఇంటికి తాళం వేసి ఉంది.
Also Read : కోర్టుకే మస్కా.. బోరుగడ్డ గ్రేట్ ఎస్కేప్!
అలా చేయాలని చూస్తున్నారు
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం.. ఇంటికి తాళం వేసి ఉండడంతో.. బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్లారనేది అంతుపట్టకుండా ఉంది.. ఈ క్రమంలో అనిల్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టిన విధానాన్ని వివరించారు. తనను అంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని అనిల్ ఆరోపించారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. పోలీసుల కొట్టిన దెబ్బల వల్ల తన తీవ్రంగా గాయపడ్డానని వ్యాఖ్యానించారు. అంతేకాదు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. తనను అంతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అనిల్ ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నాయి. మరొక కోర్టుకు నకిలీ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన నేపథ్యంలో అనిల్ పై చర్యలు తీసుకోవడానికి ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు. అతడి ఆచూకీ లభిస్తే అదుపులోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు.
Also Read : అజ్ఞాతంలో బోరుగడ్డ.. ఇంకా ఎన్నాళ్లు ఉంటాడో.. ఎందుకంటే..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Borugadda ani l who is trying to do that to borugadda anil
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com